ఇయర్ ఎండింగ్ బాక్సాఫీస్… ఈసారి జాతరే!
నవంబర్, డిసెంబర్ నెలల్లో తెలుగు బాక్సాఫీస్ ఒక జాతరను తలపించనుంది. అక్కినేని నాగార్జున, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, బాలకృష్ణ, శర్వానంద్, దుల్కర్ సల్మాన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి స్టార్ల చిత్రాలతో పాటు, రష్మిక మందన్న, షారుక్ ఖాన్ ల పాన్ ఇండియా సినిమాలు, హాలీవుడ్ విజువల్ వండర్స్ కూడా విడుదలవుతున్నాయి.
రామాయణ విజయం నవంబర్ మాసానికి గొప్ప ఆరంభాన్ని ఇచ్చింది. రాబోయే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఇయర్ ఎండింగ్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్న స్టార్ హీరోల భారీ చిత్రాలతో పాటు, క్రేజీ ప్రాజెక్ట్‌లతో థియేటర్లన్నీ కళకళలాడనున్నాయి. ఈ రెండు నెలల్లో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద అసలైన జాతరను తీసుకురాబోతున్నాయి.అక్కినేని నాగార్జున కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా వస్తున్న “కింగ్ 100″పై భారీ అంచనాలున్నాయి. మరోవైపు, విజయ్ దేవరకొండ పక్కా మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్న “రౌడీ జనార్ధన”, నాగచైతన్య మిస్టికల్ థ్రిల్లర్ “వృషకర్మ” బాక్సాఫీస్ బరిలో హాట్ టాపిక్‌గా మారాయి. బాలకృష్ణ కూడా డిసెంబర్ బరిలోనే దిగబోతున్నారు. శర్వానంద్ మాస్ లుక్‌లో వస్తున్న “భోగి”, దుల్కర్ సల్మాన్ పీరియాడిక్ డ్రామా “ఆకాశంలో ఒక తార” సినిమాలు ఫ్యామిలీ, క్లాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోనున్నాయి. యూత్ ఆడియన్స్ ఎదురుచూస్తున్న కల్ట్ సీక్వెల్ “ఈఎన్ఈ రిపీట్”, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “హైందవ” కూడా ఈ సీజన్లోనే థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.మన స్టార్ హీరోలే కాదు, పాన్ ఇండియా, హాలీవుడ్ బిగ్గీస్ కూడా ఈ రెండు నెలల్లో గట్టి పోటీ ఇవ్వబోతున్నాయి.
ప్రశ్నించిన పాపానికి ప్రాణాల మీదకు వచ్చింది..!
అర్ధరాత్రి హాస్టల్లో కలకలం.. 10 మంది అమ్మాయిల జడలు కట్
మిఠాయిలపై తేనెటీగల దాడి..లబోదిబోమన్న వ్యాపారి!
బాంబ్లా పేలిన ఫ్రిడ్జ్.. ఇల్లు దగ్ధం!
వామ్మో.. ఎంత పెద్ద చేపో.. జాలరి పంట పండిందిగా!
వాగు ఒడ్డున విచిత్రమైన రాయి.. దగ్గరకు వెళ్లి చూడగా హడల్!
ఒక్క రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రయాణికుడు!

