చందమామ గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడగా ఏదో తెలియని సంతోషం, చల్లదనం ఇచ్చే చంద్రుడిని అందరూ మామ అనిపిలుస్తారు.
చందమామ
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు చంద్రుడిని మామ అని ఎందుకు పిలుస్తారో.. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.
ఆలోచించడం
చంద్రుడుని మామ అని పిలువడం ఇప్పటిది కాదంట, ఎప్పటి నుంచే చంద్రుడిని మామ అనిపిలుస్తారం. దీని వెనుక ఒక పౌరాణిక కథ కూడా ఉన్నదంట. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మామ అని పిలవడం
పౌరాణిక కథ ప్రకారం, సముద్ర మథనం జరిగిన సమయంలో చంద్రుడు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే అప్పుడు లక్ష్మీదేవి కూడా బయటకు వచ్చింది. ఆమెను జగన్మాతగా భావిస్తారు.
పౌరాణిక కథ ప్రకారం
అయితే ఇద్దరూ కూడా సముద్ర మథనం సమయంలో బయటకు రావడంతో మహాలక్ష్మికి చంద్రుడిని సోదరుడిగా చెప్తుంటారు. జగన్మాత సోదరుడు అందరికీ మామ అయిపోయాడు.
సముద్ర మథనం
అక్కడి నుంచి మేనమామగా పరిచయం చేసే సంప్రదాయం పుట్టుకొచ్చిందంట. హిందూ పురాణాల్లో లక్ష్మీదేవికి, చంద్రుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది.
లక్ష్మీదేవి ఈ జగమంతటికీ తల్లిలాంటిది. ఇక తల్లి సోదరుడు అంటే, అందరికీ మామ కాదు కదా. అలా,ప్రతి ఒక్కరూ చంద్రుడిని మామ అని పిలుస్తారని పండితులు చెబుతున్నారు.