AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరణ్‌ - సుకుమార్‌.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నారు?

చరణ్‌ – సుకుమార్‌.. ఈసారి ఏం ప్లాన్ చేస్తున్నారు?

Samatha J
|

Updated on: Nov 13, 2026 | 11:55 AM

Share

రంగస్థలం తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న RC17 సినిమాపై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ గత సినిమాల మాదిరిగానే చరణ్ కోసం ప్రత్యేకమైన లుక్, బాడీ లాంగ్వేజ్‌ను డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో చరణ్ పాత్ర, రూపం ఎలా ఉండబోతాయోనని ఆసక్తి నెలకొంది.

రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC17 చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ తన ప్రతి సినిమాలోనూ హీరోలను సరికొత్తగా, విభిన్నంగా చూపించడంలో ప్రసిద్ధి చెందారు. రంగస్థలంలో చిట్టిబాబుగా చరణ్‌ను, పుష్పలో అల్లు అర్జున్‌ను ప్రత్యేకమైన మానరిజమ్‌లతో తీర్చిదిద్దిన సుకుమార్, ఇప్పుడు RC17లో చరణ్ కోసం మరో డిఫరెంట్ లుక్‌ను, బాడీ లాంగ్వేజ్‌ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపిస్తుండగా, సుకుమార్ త్వరలోనే ఆయనకు స్పెషల్ మేకోవర్ చేయించి ఫైనల్ లుక్‌ను ఖరారు చేయనున్నారు. రస్టీ అండ్ రా లుక్‌తో పాటు, ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అయ్యేలా ఒక కొత్త బాడీ లాంగ్వేజ్‌ను కూడా జోడించనున్నారని సమాచారం. రంగస్థలాన్ని మించేలా సుకుమార్ ఈసారి చరణ్‌ను ఎలాంటి విభిన్నమైన అవతార్‌లో చూపించబోతున్నారోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us