కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు 2.5 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వేడి నీళ్లు: తగినంత, (పిండి కలుపడానికి), నూనె: డీప్ ఫ్రై చేయడానికి సరిపడా తీసుకోవాలి.
స్టెప్ 1
ముందుగా ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పును తీసుకోండి. వీటిని రెండు సార్లు శుభ్రంగా కడిగి, కొన్ని నీళ్లు పోసి ఒక గంట సేపు నానబెట్టాలి
స్టెప్ 2
పప్పులు నానే లోపు, పావు కప్పు పచ్చిమిరపకాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు తీసుకోండి. ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం మిక్సీ పట్టుకోవాలి
స్టెప్ 3
పిండి కలుపుకున్నాక, మూత పెట్టి నాననివ్వాలి. ఆ తరవాత పిండిని మరోసారి బాగా కలుపుకోవాలి.
స్టెప్ 4
చేతికి ఆయిల్ రాసుకొని,నిమ్మకాయ సైజు అంత ఉండల్ని చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోండి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కేలోపు చెక్కల్ని వత్తుకోవాలి.