Electricity: ఒక యూనిట్ అంటే ఎంత..? మీ ఇంట్లో ఏ వస్తువుకు ఎంత కరెంట్ ఖర్చవుతుందో సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..
ఇంట్లో రోజూ కరెంట్ వాడుతుంటాం. కానీ ఏ పరికరం ఎంత కరెంట్ ఉపయోగిస్తుందనేది చాలామందికి తెలియదు. మీరు సింపుల్‌గా ఈ విషయం తెలసుకోవచ్చు. మీరు దీనిని తెలుసుకోవాలంటే ముందుగా ఒక యూనిట్ అంటే ఎంత అనేది తెలుసుకోవాలి. దీని వల్ల మీకు అసలు లెక్క అర్థమవుతుంది.

కరెంట్‌ను యూనిట్లలో లెక్కిస్తారు. మీకు ప్రతీ నెలా వచ్చే బిల్లులో ఎన్ని యూనిట్లు కరెంట్ ఉపయోగించారనేది నమోదు చేసి ఉంటారు. మీ ఇంట్లోని కరెంట్ మీటర్ రీడింగ్ చూసుకున్నా ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతున్నారనేది సులువుగా తెలుస్తుంది. కరెంట్ బిల్లు వచ్చిందా..? బిల్లు కట్టేశామా? అనేదే చాలామంది చూస్తారు. కానీ నెలకు ఎన్ని యూనిట్ల కరెంట్ ఉపయోగిస్తున్నాం..? రోజుకు ఎన్ని యూనిట్ల కరెంట్ వాడుతున్నాం? అనేది చాలామంది పట్టించుకోరు. కానీ మీ ఇంట్లో ఎంత కరెంట్ ఖర్చు అవుతుందనేది తెలుసుకోవచ్చు. ఏ పరికరం ఎంత విద్యుత్ ఉపయోగిస్తుందనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. అసలు ఒక యూనిట్ అంటే ఎంత కరెంట్? మీ ఇంట్లోని ఏ వస్తువు ఎంత కరెంట్ వినియోగించుకుంటుంది? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒక యూనిట్ అంటే ఎంత..?
కరెంట్ వైర్ల ద్వారా మీ ఇంట్లోని మీటర్‌కు కరెంట్ వస్తూ ఉంటుంది. మీరు ఇంట్లోకి ఎంత కరెంట్ వాడుతున్నారనేది ఎలక్ట్రానిక్ మీటర్ లెక్కిస్తుంది. ఇది Kwh(కిలో వాట్ అవర్) విధానంలో మీరు ఇంట్లో ఉపయోగించే కరెంట్‌ను లెక్కింపు చేపడుతుంది. K అంటే కిలో అని అర్థం. అంటే 1000గా చెప్పవచ్చు. W అంటే వాట్స్, H అంటే అవర్ అని అర్థం. మొత్తం కలిస్తే కిలో వాట్ అవర్ అని అర్థం. గంటకు 1000 వాట్స్‌ను ఇది సూచిస్తుంది. అంటే 1000 వాట్స్ సామర్థ్యం కలిగిన పరికరాన్ని ఒక గంట సేపు ఉపయోగిస్తే 1Kwh ఖర్చు అవుతుంది. 1kwhనే ఒక యూనిట్‌గా చెబుతారు. ఈ యూనిట్ల ఆధారంగా మీరు ఇంట్లోకి ఖర్చు చేసే విద్యుత్‌ను లెక్కించి బిల్లు వేస్తారు.
గంటసేపు ఫ్యాన్ వాడితే ఎంత విద్యుత్ ఖర్చవుతుంది..?
మీరు వాడే ప్రతీ ఎలక్ట్రానిక్ పరికరం లైట్లు, ఫ్యాన్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు వంటివి వాట్స్ పవర్ కలిగి ఉంటుంది. మీరు పరికరం కొనుగోలు చేసేటప్పుడు వాట్స్ నమోదు చేసి ఉంటుంది. దీని ఆధారంగా ఈ పరికరం ఎంత విద్యుత్‌ను ఉపయోగించుకుంటుందనేది తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మీరు 1000 వాట్స్ గల పరికరాన్ని గంటసేపు ఉపయోగిస్తే ఒక యూనిట్ కరెంట్ ఖర్చు అవుతుంది. మీరు 100 వాట్స్ సామర్థ్యం కలిగిన ఫ్యాన్‌ను 10 గంటలు ఉపయోగిస్తే ఒక యూనిట్ విద్యుత్ ఖర్చువుతుంది. మీరే వాడే పరికరం వోల్జేజ్ ఆధారంగా ఎంత విద్యుత్ ఉపయోగిస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఏ పరికరం ఎన్ని యూనిట్లు వాడుతుందనేది తెలుసుకోవడం ద్వారా మీరు కరెంట్ ఆదా చేసుకోవచ్చు. ఆ పరికరాన్ని తక్కువగా ఉపయోగించడం వల్ల బిల్లు తక్కువగా వస్తుంది.
ఇలా లెక్కించుకోండి..
