AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: పంచగ్రాహి యోగం.. ఈ రాశులకు తిరుగులేని రాజయోగం, వైవాహిక జీవితంలో ఆనందం

Panchagrahi Yoga: ఫిబ్రవరిలో ఏర్పడే పంచగ్రాహీ రాజ యోగం ప్రభావం అన్ని రాశుల్లోనూ కనిపిస్తుంది. వారిలో కొందరు అదృష్టవంతులవుతారు. దీంతో వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ పురోగతి ఉంటుంది. ఫిబ్రవరిలో ఏర్పడే పంగ్రాహి రాజయోగంతో లాభపడే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Zodiac Signs: పంచగ్రాహి యోగం.. ఈ రాశులకు తిరుగులేని రాజయోగం, వైవాహిక జీవితంలో ఆనందం
Panchagrahi Yoga
Rajashekher G
|

Updated on: Jan 28, 2026 | 4:16 PM

Share

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల మార్పుల కారణంగా అనేక అరుదైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. అలాంటి యోగాల వల్ల 12 రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఫిబ్రవరి నెలలో గ్రహాలకు అధిపతిగా పరిగణించబడే సూర్య భగవానుడు, గ్రహాలకు యువరాజుగా పిలువబడే బుధుడు, సంపదకు మూలమైన శుక్రుడు, గ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడిగా పేరొందిన కుజుడు, ఛాయ గ్రహం రాశువు కలయికతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతోంది. ప్రధానంగా ఈ యోగం వని గ్రహమైన కుంభరాశిలో ఏర్పడుతోంది. ఈ యోగ ప్రభావం అన్ని రాశుల్లోనూ కనిపిస్తుంది. వారిలో కొందరు అదృష్టవంతులవుతారు. దీంతో వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్ పురోగతి ఉంటుంది. ఫిబ్రవరిలో ఏర్పడే పంగ్రాహి రాజయోగంతో లాభపడే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సింహరాశి

సింహరాశి వారికి 7వ ఇంట్లో పంచగ్రాహి యోగం ఏర్పడుతోంది. దీని కారణంగా సింహరాశివారికి సానుకూల ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. రాజకీయ, ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలలో ఉన్నవారు గణనీయమైన ప్రయోజనాలను అందుకుంటారు. మీ పని పరిస్థితి మెరుగుపడుతుంది. అవివాహితులకు మంచి సంబంధం దొరుకుతుంది. దీర్ఘకాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి.

మేషరాశి

మేష రాశి వారికి 11వ ఇంట్లో పంచగ్రాహి రాజయోగం ఏర్పడుతోంది. ఇది మేష రాశి వారికి ఆదాయంలో మంచి పెరుగుదలకు దారితీస్తుంది. కెరీర్‌లో మంచి పురోగతి ఉండబోతుంది. అనేక శుభవార్తలను వింటారు. పనిలో మీ స్థానం బలపడుతుంది. ప్రతి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్, లాటరీ వంటి వాటి నుంచి మీకు మంచి లాభం రావచ్చు.

కుంభ రాశి

కుంభ రాశి వారికి మొదటి ఇంట్లో పంచగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఇది కుంభ రాశి వారి ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. జంటల మధ్య ప్రేమ పెరుగుతుంది. పని చేసే వారికి పదోన్నతి, జీతం పెరిగే అవకాశం ఉంది. అనేక మార్గాల నుంచి మీకు ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు.

(Declaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

పంచగ్రాహి యోగం.. ఈ రాశులకు తిరుగులేని రాజయోగం
పంచగ్రాహి యోగం.. ఈ రాశులకు తిరుగులేని రాజయోగం
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. కొరియన్స్‌లా మెరిచే చర్మం మీ సొంతం!
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. కొరియన్స్‌లా మెరిచే చర్మం మీ సొంతం!
వివాదంలో బిగ్‌బాస్ 7 టైటిల్ విన్నర్.. ఆలయ నిషేధాన్ని ఉల్లంఘించి
వివాదంలో బిగ్‌బాస్ 7 టైటిల్ విన్నర్.. ఆలయ నిషేధాన్ని ఉల్లంఘించి
జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్..
జబర్దస్త్‌లో సుధీర్, హైపర్ ఆది కంటే ఎక్కువ రెమ్యునరేషన్..
హిట్టు అంటే ఇది.. కేవలం 5 కోట్లతో తీస్తే 30 కోట్ల కలెక్షన్స్..
హిట్టు అంటే ఇది.. కేవలం 5 కోట్లతో తీస్తే 30 కోట్ల కలెక్షన్స్..
వాలంటైన్స్ డే : ప్రపోజ్ చేయడానికి టాప్ 5 రొమాంటిక్ ప్లేసెస్ ఇవే
వాలంటైన్స్ డే : ప్రపోజ్ చేయడానికి టాప్ 5 రొమాంటిక్ ప్లేసెస్ ఇవే
జర పైలం.. ఈ రాశుల వారిని ఆడుకోబోతున్న శని.. నిత్యం నిందల పాలే!
జర పైలం.. ఈ రాశుల వారిని ఆడుకోబోతున్న శని.. నిత్యం నిందల పాలే!
ఆఫీసులో ఎంత కష్టపడినా ఫలితం లేదా.. పాటించాల్సిన వాస్తు నియమాలివే
ఆఫీసులో ఎంత కష్టపడినా ఫలితం లేదా.. పాటించాల్సిన వాస్తు నియమాలివే
బరువు తగ్గించే ఇడ్లీలు.. కొత్త హెల్తీ ట్రెండ్.. స్లిమ్‌ అవుతారు
బరువు తగ్గించే ఇడ్లీలు.. కొత్త హెల్తీ ట్రెండ్.. స్లిమ్‌ అవుతారు
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..