Zodiac Signs: వృషభ రాశిలోకి చంద్రుడు.. వారికి విపరీత రాజయోగం పట్టనుంది.. !
జాతక చక్రంలో చంద్రుడు ఉచ్ఛస్థతిలో ఉన్నవారికి సమస్యలు తక్కువగాను, సుఖాలు ఎక్కువగానూ ఉంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మొత్తం మీద చంద్రుడు ఉచ్ఛ స్థితిలోకి రావడమనేది వివిధ రాశుల వారి జీవితాల్లో తప్పకుండా కొద్దో గొప్పో మార్పులు, అనుకూలతలు తీసుకు వస్తుందని చెప్పవచ్చు.

అక్టోబర్ 3, 4, 5 తేదీలలో చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టబోతున్నాడు. మనఃకారకు డైన చంద్రుడు ఉచ్ఛస్థలి పట్టే పక్షంలో తప్పకుండా ప్రతి వారి జీవితంలోనూ ఉత్సాహవంతమైన, ఉల్లాసకరమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. జాతక చక్రంలో చంద్రుడు ఉచ్ఛస్థతిలో ఉన్నవారికి సమస్యలు తక్కువగాను, సుఖాలు ఎక్కువగానూ ఉంటాయని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మొత్తం మీద చంద్రుడు ఉచ్ఛ స్థితిలోకి రావడమనేది వివిధ రాశుల వారి జీవితాల్లో తప్పకుండా కొద్దో గొప్పో మార్పులు, అనుకూలతలు తీసుకు వస్తుందని చెప్పవచ్చు.
మేషం: ఈ రాశివారికి నాలుగవ (సుఖ) స్థానాధిపతి అయిన చంద్రుడు ధన స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల తప్పకుండా ఆదాయం కలిసి వస్తుందని చెప్పవచ్చు. గృహ, వాహన సంబంధమైన సమస్యలు, ఒత్తిళ్లు, రుణాలు ఏవైనా ఉన్నాయంటే అవి పరిష్కారమయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మాతృమూలక ధన లాభం ఉంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరు స్తాయి.
వృషభం: ఈ రాశికి తృతీయ స్థానాధిపతి అయిన చంద్రుడు ఈ రాశిలో ఉచ్ఛలోకి రావడం వల్ల ఎటువంటి ప్రయత్నమైనా కలిసి వస్తుంది. సోదరులతో సయోధ్య పెరుగుతుంది. కొందరి మధ్య వివాదాలను పరిష్కరించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదా అధికార యోగానికి సంబంధించి మార్గం సుగమం అవుతుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా, కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది.
మిథునం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన చంద్రుడు వ్యయ స్థానంలో ఉచ్ఛలోకి రావడం వల్ల శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, సహాయ కార్యక్రమాల మీద ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. తల్లి ఆరోగ్యం కుదుటపడుతుంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. సంపాదనలో ఎక్కువ భాగాన్ని దాచుకోవ డానికి అవకాశం కలుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోతుంది.
కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు లాభ స్థానంలో బలవంతుడు కావడం నిజంగా ఒక గొప్ప విశేషంగానే భావించవచ్చు. ఆదాయ వృద్ధికి సంబంధించి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా పురోగతి ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
సింహం: ఈ రాశివారికి వ్యయ స్థానాధిపతి దశమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని కీలకమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భార్య వైపు నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. భార్య వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో సామరస్యం పెరుగు తుంది.
కన్య: ఈ రాశికి లాభ స్థానాధిపతి అయిన చంద్రుడు భాగ్య స్థానంలో శక్తిమంతుడు కావడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. లాటరీలు, జూదాలు, షేర్లు, స్పెక్యులేషన్ వంటివి బాగా కలిసి వస్తాయి. ప్రధాన ఆదాయంలో వృద్ధి ఉంటుంది. దాంతో పాటు అదనపు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం లభించవచ్చు. విదేశాల్లో ఉన్నవారికి స్థిరత్వం లభిస్తుంది.
తుల: ఈ రాశివారికి దశమ స్థానాధిపతి అయిన చంద్రుడు అష్టమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ఉద్యో గంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం, బరువు బాధ్యతలు పెరగడం, అధికారం విస్తరిం చడం, మరింత మంచి ఉద్యోగానికి ఆఫర్ రావడం వంటివి జరుగుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు సప్తమ స్థానంలో ఉచ్ఛలోకి రావడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలు ఆర్థికంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. సతీమణి వృత్తి, ఉద్యోగాల్లో పదో న్నతి దక్కించుకుంటారు. భార్య వైపు నుంచి సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. తండ్రి సహాయం లభి స్తుంది.
ధనుస్సు: ఈ రాశికి అష్టమాధిపతి అయిన చంద్రుడు ఆరవ స్థానంలో ఉచ్ఛలోకి రావడం వల్ల ఒక విధమైన విపరీత రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాకుండా సర్వత్రా ఏ పని చేసినా చెల్లుబాటు అవుతుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరి చయాలు ఏర్పడడం, స్వయంగా ప్రముఖుడుగా గుర్తింపు పొందడం వంటివి జరుగుతాయి. శత్రు, రోగ, రుణ బాధలు ఏవైనా ఉంటే వాటి నుంచి విముక్తి లభిస్తుంది. వివాదాలు పరిష్కారమవు తాయి.
మకరం: ఈ రాశికి సప్తమాధిపతి అయిన చంద్రుడు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడమే కాకుండా, అధికారాలను పంచుకోవడం జరుగుతుంది. పిల్లలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాలపరంగా మంచి అదృష్టం పడుతుంది.
కుంభం: ఈ రాశివారికి ఆరవ స్థానాధిపతి అయిన చంద్రుడు నాలుగవ స్థానంలో ఉచ్ఛలోకి రావడం వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి, ప్రాధాన్యం పెరగడానికి అవకాశం ఉంటుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరడానికి మార్గం సుగమం అవుతుంది. తల్లి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగానే కాక, ఆర్థికంగా కూడా స్థిరత్వం లభించవచ్చు.
మీనం: ఈ రాశివారికి పంచమ స్థానాధిపతి అయిన చంద్ర గ్రహం తృతీయ స్థానంలో ఉచ్ఛలోకి రావడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను ప్రవేశపెట్టి లబ్ధి పొందడం జరుగు తుంది. ఈ రాశివారికి సలహాలకు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. పిల్లలు చక్కని పురో గతి సాధిస్తారు. ఏ ప్రయత్నం చేపట్టినా, ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సమయస్ఫూర్తిగా పూర్తి చేసుకుంటారు. మంచి గుర్తింపు లభిస్తుంది.



