Money Astrology: రుణ భారం నుంచి త్వరలోనే ఆ రాశుల వారికి విముక్తి.. ! అందులో మీరున్నారా..?
ఎక్కువ మందికి రుణ సమస్యలు తప్పకపోవచ్చు. ఇంటి కోసమో, వాహనం కోసమో రుణం చేయడం వేరు. అవసరాల కోసం రుణాలు చేసి ఇబ్బందులు పడడం వేరు. ఏదో ఒక కారణం మీద రుణ సమస్యలు అధికమై ఒత్తిడికి, ఇబ్బందులకు గురవుతున్నవారు సాధారణంగా ఈ రుణ సమస్యల నుంచి విముక్తి ఎప్పుడు అని ఆలోచిస్తుంటారు. రుణాలకు సంబంధించిన ఆరవ స్థానం అనుకూలంగా ఉన్నపక్షంలో ఎటువంటి రుణ సమస్యల నుంచయినా బయటపడేందుకు మార్గాలు అందుబాటులోకి వస్తాయి.
ఎక్కువ మందికి రుణ సమస్యలు తప్పకపోవచ్చు. ఇంటి కోసమో, వాహనం కోసమో రుణం చేయడం వేరు. అవసరాల కోసం రుణాలు చేసి ఇబ్బందులు పడడం వేరు. ఏదో ఒక కారణం మీద రుణ సమస్యలు అధికమై ఒత్తిడికి, ఇబ్బందులకు గురవుతున్నవారు సాధారణంగా ఈ రుణ సమస్యల నుంచి విముక్తి ఎప్పుడు అని ఆలోచిస్తుంటారు. రుణాలకు సంబంధించిన ఆరవ స్థానం అనుకూలంగా ఉన్నపక్షంలో ఎటువంటి రుణ సమస్యల నుంచయినా బయటపడేందుకు మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఎవరెవరికి త్వరలో రుణ విముక్తి లభించేదీ ఇక్కడ పరిశీ లిద్దాం. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చిక రాశుల వారికి రుణ బాధ బాగా తగ్గే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశివారికి శనీశ్వరుడు బాగా అనుకూలంగా ఉన్నాడు. రాశ్యధిపతి శుక్రుడు ఆరవ స్థానంలో స్వస్థానంలో సంచరిస్తున్నందువల్ల వీరు ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించి రుణ భారాన్ని చాలావరకు తగ్గించుకునే అవకాశం ఉంది. ఖర్చుల్ని తగ్గించుకుని, పొదుపు పాటించి, అదనపు ఆదాయ మార్గాలు చేపట్టి వీరు రుణ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. స్వల్పకాలిక రుణాలతో పాటు, దీర్ఘకాలిక రుణాలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఈ రాశివారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
- మిథునం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో రవి, కుజులు సంచారం చేస్తుండడం వల్ల స్వల్పకాలిక రుణాలు, చేబదుళ్లనే కాకుండా దీర్ఘకాలిక రుణాలను కూడా ఒక పద్ధతి ప్రకారం తీర్చేసే అవకాశం ఉంది. సాధారణంగా వీరు రుణాలను అట్టిపెట్టుకునే అవకాశం ఉండదు. అదనపు ఆదాయ మార్గాల ద్వారా, ఇతర ఆర్థిక ప్రయత్నాల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకుని, రుణ భారాన్ని వీలైనం తగా తగ్గించుకోవడం జరుగుతుంది. వీరికి ఇక రుణ ఒక భారంగా ఉండే అవకాశం లేదు. కాల భైరవాష్టకం చదువుకోవడం వల్ల మరింత త్వరగా రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో బుధుడి సంచారం జరుగుతున్నందువల్ల ఒకటి రెండు నెలల్లో తప్పకుండా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. అనుకోకుండా జీతభత్యాలు పెరగడం, ఏదో ఒక రూపేణా ఆదాయం పెరగడం, రావలసిన డబ్బు అందడం వంటివి జరిగి, వీరు ఒక ప్లాన్ ప్రకారం ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే సూచనలున్నాయి. తల్లితండ్రుల నుంచి కూడా ఆశించిన సహకారం లభిస్తుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశివారు లక్ష్మీదేవి స్తోత్రం చదువుకోవడం మంచిది.
- కన్య: ఈ రాశివారికి ఆరవ స్థానంలో ఉన్న శనీశ్వరుడు తప్పకుండా రుణ భారం నుంచి విముక్తి కల్పిస్తాడు. రుణాలకు కారకుడైన శని రుణ స్థానంలోనే ఉన్నందువల్ల రుణ భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ రుణాలతో పాటు, దీర్ఘకాలిక రుణాల నుంచి సైతం ఈ రాశివారు బయటపడడం జరుగుతుంది. కొత్తగా రుణాలు చేసే అవసరం ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరిగి వీరు ఆర్థిక సమస్యలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు రోజూ వినాయక స్తోత్రం చదువుకోవడం వల్ల ఇవి మరింత త్వరగా పరిష్కారం అవుతాయి.
- తుల: ఈ రాశివారికి ఆరవ స్థానంలో సంచరిస్తున్న రాహువు వల్ల రుణ సమస్యలు బాగా తగ్గుస్థాయిలో ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉన్నందువల్ల కొత్తగా రుణాలు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సాధారణంగా రాహువు రుణ సమస్యలకు అవకాశం ఇవ్వడు. రుణం ఉన్నా ఒత్తిడి లేకుండా చేయడం జరుగుతుంది. ఏదో ఒక విధంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం జరుగుతుంది. బంధువులు లేదా కుటుంబ సభ్యుల సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. స్కంద స్తోత్రం చదువుకోవడం వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది.
- వృశ్చికం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో గురు సంచారం వల్ల రుణ సంబంధమైన ఒత్తిడి ఉండే అవకాశం లేదు. దీర్ఘకాలిక రుణమైనా, స్వల్పకాలిక రుణమైనా అదొక సమస్యగా మారకపోవచ్చు. రకరకాల మార్గాలలో ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశ ముంది. సాధారణంగా స్వల్పకాలిక రుణాల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. పొదుపు పాటించడం, ఖర్చులు తగ్గించుకోవడం, ఒక పిసినారిగా మారడం వగైరాల ద్వారా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. వీరు శివార్చన చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.