Luck Astrology: అనుకూల స్థితిలో కుజుడు, గురువు.. ఆ రాశుల వారు ఆస్తిపాస్తులు సంపాదించుకునే అవకాశం..!
ప్రస్తుత గ్రహచారం ప్రకారం ఏడు రాశుల వారికి ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొద్ది ప్రయత్నంతో తప్పకుండా ఈ ఏడు రాశుల వారి కలలు, ఆశలు సాకారం అవుతాయి. ముఖ్యంగా ఇల్లు కొనుక్కోవడం, సరైన ప్రదేశంలో స్థలం కొనుక్కోవడం విషయాలలో అనుకూలతల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత గ్రహచారం ప్రకారం ఏడు రాశుల వారికి ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో కొద్ది ప్రయత్నంతో తప్పకుండా ఈ ఏడు రాశుల వారి కలలు, ఆశలు సాకారం అవుతాయి. ముఖ్యంగా ఇల్లు కొనుక్కోవడం, సరైన ప్రదేశంలో స్థలం కొనుక్కోవడం విషయాలలో అనుకూలతల గురించి ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా కుజుడు అనుకూలంగా ఉన్నవారికి స్థిరాస్తులు, గురువు అనుకూలంగా ఉన్నవారికి చరాస్తులు సమకూరే అవకాశం ఉంటుంది. ఆ ఏడు రాశులు – వృషభం, కర్కాటకం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీనం.
- వృషభం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో రవి, కుజులు కలిసి ఉన్నందువల్ల తప్పకుండా సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇల్లు కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ధన కారకుడైన గురువు వ్యయస్థానంలో ఉన్నందువల్ల ఈ ఇంటి మీద లేక స్థలం మీద భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఇండిపెండెంట్ ఇల్లు కానీ, ఫ్లాట్ గానీ అమరే అవకాశం ఉంది. స్థలం కొనే సూచనలు కూడా ఉన్నాయి. రుణాలు గానీ, ఆర్థిక సహాయం కానీ తేలికగా లభించే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశివారికి పంచమ స్థానంలో కుజ, రవులు కలిసి ఉండడం వల్ల సొంత ఇల్లు ఉండడం అన్న ఆలోచన తప్పకుండా కలుగుతుంది. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి తప్పకుండా ఫ్లాట్ అమరే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా కూడా ఇల్లు గానీ, స్థలం గానీ అందివచ్చే అవకాశం ఉంటుంది. ఇల్లు కొనే విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నతర్వాత ఆర్థిక సహాయం అందడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. తల్లితండ్రులు, పిల్లల సహాయ సహకారాలు ఆశించిన స్థాయిలో లభిస్తాయి.
- సింహం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో అంటే గృహ స్థానంలో రాశ్యధిపతి రవితో పాటు కుజుడు కూడా ఉన్నందువల్ల తప్పకుండా గృహ యోగం ఉంది. ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇల్లు కొనడానికి అవకాశం ఉంది. ఎక్కువ ప్రయత్నం కూడా అవసరం కాకపోవచ్చు. ప్రభుత్వపరంగా కూడా సహాయ సహకారాలు లభించే సూచనలున్నాయి. తల్లి వైపు నుంచి ఆశించిన సహకారం అందు తుంది. చాలా త్వరగా ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. ఎంత త్వరగా ప్రయత్నిస్తే అంత మంచిది.
- తుల: ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజుడు లాభాధిపతి రవితో కలిసి ఉండడం, ఈ రాశిని గురువు వీక్షించడం వల్ల అతి త్వరలో గృహ యోగం పట్టే అవకాశం ఉంది. ఇల్లు కొనుక్కోవడానికి ఆర్థి కంగా ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. కొద్దిగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే అతి త్వరలో ఇల్లు అమరుతుంది. ఇంటి కొనుగోలు వ్యవహారంలో సతీమణి సహకారం, కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఇండిపెండెంట్ ఇల్లు లేదా ఫ్లాట్ కొనుక్కోవడానికి ఇది చాలా అనుకూల సమయం.
- మకరం: స్థిరాస్తికి కారకుడైన కుజుడు ఈ రాశివారికి లాభ స్థానంలో ఉండడం, గృహ స్థానంలో ధన కారకుడు గురువు సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారికి ఇల్లు గానీ, ఫ్లాట్ గానీ, స్థలం గానీ తప్పకుండా అమరే అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా గానీ, ఉద్యోగపరంగా గానీ గృహ సౌకర్యం ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. ఇంటి ప్రయత్నం ప్రారంభించిన వెంటనే ఆర్థిక సహాయం అందుబాటులోకి వస్తుంది. తల్లి వైపు నుంచి లేదా భార్య వైపు నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
- మీనం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో కుజ సంచారం, ధన స్థానంలో రాశ్యధిపతి గురువు సంచారం వల్ల కొద్దిపాటి ప్రయత్నంతో గృహ యోగం పట్టే సూచనలున్నాయి. సకాలంలో ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. నిజానికి ఇల్లు లేదా ఫ్లాట్ కొనడానికి ఇంతకన్నా అనుకూల సమయం మరొకటి ఉండదని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో పాటు, ఉద్యోగపరంగా కూడా సహాయం లభించే అవకాశం ఉంది. గృహ యోగంతో పాటు ఇతరత్రా కూడా ఆస్తిపాస్తులు పెరిగే సూచనలు న్నాయి.