Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Astrology: శుభగ్రహాల అనుకూలత.. ఈ రాశుల వారైతే ప్రేమకు బెటర్!

ప్రస్తుతం గురు, శుక్రులే కాకుండా బుధుడు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కబోతున్నాయి. ఈ శుభ గ్రహాల అనుకూలతలు జూన్ లో కూడా కొనసాగుతున్నందువల్ల కొన్ని రాశుల వారితో ప్రేమలో పడడం వల్ల ప్రేమ జీవితం, ఆ తర్వాత పెళ్లి జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా వెలిగిపోయే అవకాశముంటుంది.

Love Astrology: శుభగ్రహాల అనుకూలత.. ఈ రాశుల వారైతే ప్రేమకు బెటర్!
Love Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 14, 2024 | 6:29 PM

ప్రస్తుతం గురు, శుక్రులే కాకుండా బుధుడు కూడా అనుకూలంగా మారుతున్నందువల్ల ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కబోతున్నాయి. ఈ శుభ గ్రహాల అనుకూలతలు జూన్ లో కూడా కొనసాగుతున్నందువల్ల కొన్ని రాశుల వారితో ప్రేమలో పడడం వల్ల ప్రేమ జీవితం, ఆ తర్వాత పెళ్లి జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంలా వెలిగిపోయే అవకాశముంటుంది. ప్రస్తుతం వృషభం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి శుభ గ్రహాల అనుకూలతలు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ రాశుల వారిని ప్రేమించే వాళ్లు బాగా సుఖపడడానికి అవకాశముంది.

  1. వృషభం: ఈ రాశిలో గురువు సంచారం చేస్తుండడం, త్వరలో శుక్రుడు కూడా ఈ రాశిలోకి వస్తుండడం వల్ల ఈ రాశి వారిలో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా ఉండడం జరుగుతుంది. బాధ్యతలకు కట్టుబడి ఉండడం, ప్రేమ తత్వం పెరగడం వంటివి చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవ హారాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో తప్పుదోవలు తొక్కే అవకాశముం డదు. ఒకే వ్యక్తికి కట్టుబడే అవకాశముంటుంది. జీవిత భాగస్వామికి గౌరవమర్యాదలు ఇస్తారు.
  2. కర్కాటకం: కుటుంబ బంధాలకు, నీతి నిజాయతీలకు విలువనిచ్చే ఈ రాశివారికి ప్రస్తుతం లాభ స్థానంలో గురు శుక్రుల చేరిక వల్ల ప్రేమ వ్యవహారాల్లో విలువలు పాటించే అవకాశం ఉంటుంది. వీరు ప్రేమ జీవితానికి కట్టుబడి ఉంటారు. ప్రేమ భాగస్వామిని ఆదరంగా, ఆత్మీయంగా చూసుకోవడంతో పాటు, విలువైన కానుకలు బహూకరించడం, ఆ వ్యక్తిని మెప్పించే ప్రయత్నం చేయడం ఎక్కు వగా జరుగుతుంది. వీరితో ప్రేమలో పడినా, వీరిని పెళ్లి చేసుకున్నా జీవితం హ్యాపీగా గడిచిపోతుంది.
  3. కన్య: ప్రతి విషయంలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో పాటు నీతి నిజాయతీలకు కట్టుబడి ఉండే ఈ రాశివారికి ప్రస్తుతం గురు, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వీరితో ప్రేమలో పడే వారికి ఎటువంటి సమస్యలూ ఉండకపోవచ్చు. జీవితం సాఫీగా సాగిపోవడానికి ఈ రాశివారు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. తమతో పాటు ఇతరులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుం టారు. అందువల్ల వీరిని ప్రేమించడానికి, వైవాహిక జీవితం గడపడానికి సందేహించనక్కర లేదు.
  4. తుల: ఈ రాశివారు సరదాగా, సంతోషంగా జీవితం గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం శుక్ర, బుధ, గురు గ్రహాలు మూడూ శుభప్రదంగా ఉన్నందువల్ల ప్రేమలకు, పెళ్లిళ్లకు సమయం అన్ని విధా లుగానూ అనుకూలంగా ఉంటుంది. వీరితో ప్రేమ జీవితమైనా, పెళ్లి జీవితమైనా నిత్య కల్యాణం పచ్చతోరణంలా సాగిపోతుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కుటుంబ బంధాలను వీరు వదులు కునే, నిర్లక్ష్యం చేసే అవకాశం ఉండదు. జీవిత భాగస్వామిని వీరు ఉన్నత స్థానంలో ఉంచుతారు.
  5. ధనుస్సు: జీవితంలో పురోగతి చెందడానికి, సరదాగా ఉండడానికి, జీవితాన్ని వీలైనంత ఆనందంగా గడప డానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే ఈ రాశివారికి శుభ గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంది. వీరిని ప్రేమలో పడినవారికి గాఢమైన ప్రేమానురాగాలు లభిస్తాయి. విందులు, వినోదాలతో పాటు, విహార యాత్రలతో వీరు జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. గృహ, వాహన యోగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వీరితో ప్రేమలో పడే వారికి వీరితో విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది.
  6. మకరం: కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే ఈ రాశివారితో ప్రేమలో పడినవారు, వీరిని పెళ్లి చేసు కున్నవారు అదృష్టవంతులవుతారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. వీరు ఒకసారి ప్రేమలో పడితే వెనక్కు తిరిగి చూసుకోరు. ఒకే వ్యక్తికి కట్టుబడి ఉండడం జరుగుతుంది. ఇప్పుడు శుభ గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల వీరితో ప్రేమలో పడేవారు బాగా అదృష్టవంతులయ్యే అవ కాశం ఉంది. వీరు జీవిత భాగస్వామికి తన కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది.

యూట్యూబర్ హర్షసాయిని అన్‌ఫాలో చెయ్యాలని సజ్జనార్ పిలుపు
యూట్యూబర్ హర్షసాయిని అన్‌ఫాలో చెయ్యాలని సజ్జనార్ పిలుపు
ధోని ప్రాక్టీస్ సెషన్.. సిక్సర్లతో హీటెక్కిన స్టేడియం!
ధోని ప్రాక్టీస్ సెషన్.. సిక్సర్లతో హీటెక్కిన స్టేడియం!
ఈ ప్రొజెక్టర్‌తో ఇంట్లోనే సినిమా థియేటర్‌.. కేవలం రూ.4 వేలలోపే..!
ఈ ప్రొజెక్టర్‌తో ఇంట్లోనే సినిమా థియేటర్‌.. కేవలం రూ.4 వేలలోపే..!
అఫీషియల్.. థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
అఫీషియల్.. థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలో సూపర్ హిట్ సినిమా
ఇషాన్‌ కిషన్ విధ్వంసం.. 23 బంతుల్లోనే
ఇషాన్‌ కిషన్ విధ్వంసం.. 23 బంతుల్లోనే
2028 ఒలింపిక్స్ కోసం తిరిగి రానున్న కింగ్? హింట్ ఇచ్చేసాడుగా
2028 ఒలింపిక్స్ కోసం తిరిగి రానున్న కింగ్? హింట్ ఇచ్చేసాడుగా
మీకు ఇష్టమైన కలర్ మీ గురించి ఏమి చెబుతుందో తెలుసుకోండిలా..!
మీకు ఇష్టమైన కలర్ మీ గురించి ఏమి చెబుతుందో తెలుసుకోండిలా..!
టాటా నుంచి అద్భుతమైన ఎలక్ట్రీక్‌ కారు..సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ
టాటా నుంచి అద్భుతమైన ఎలక్ట్రీక్‌ కారు..సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ
అయ్యబాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా...
అయ్యబాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా...
ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?
ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?