Maha Yogas: కుజ దోషంతో ఆ రాశుల వారికి మహా యోగాలు.. అందులో మీ రాశి ఉందా..?

ప్రస్తుతం తన స్వక్షేత్రమైన మేష రాశిలో సంచారం చేస్తున్న కుజ గ్రహం జూలై 12 వరకు ఇదే రాశిలో కొనసాగుతుంది. సాధారణంగా ఏదైనా లగ్నానికి లేదా రాశికి 1,2,4,7,8,12 రాశుల్లో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం ఏర్పడుతుంది. అయితే, కుజుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం పూర్తి స్థాయిలో పని చేసే అవకాశం ఉండదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.

Maha Yogas: కుజ దోషంతో ఆ రాశుల వారికి మహా యోగాలు.. అందులో మీ రాశి ఉందా..?
Kuja Gochar 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 24, 2024 | 7:26 PM

ప్రస్తుతం తన స్వక్షేత్రమైన మేష రాశిలో సంచారం చేస్తున్న కుజ గ్రహం జూలై 12 వరకు ఇదే రాశిలో కొనసాగుతుంది. సాధారణంగా ఏదైనా లగ్నానికి లేదా రాశికి 1,2,4,7,8,12 రాశుల్లో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం ఏర్పడుతుంది. అయితే, కుజుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం పూర్తి స్థాయిలో పని చేసే అవకాశం ఉండదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. కుజ దోషం కలగజేసే రాశుల్లో కుజుడు సంచారం చేస్తున్నప్పటికీ కొన్ని రాశులకు ధన సంపాదన పెరగడం, కోర్టు కేసుల్లో నెగ్గడం, హోదాలు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇందులో మేషం, వృషభం, కన్య, తుల, మకరం, మీన రాశులున్నాయి .

  1. మేషం: ఈ రాశిలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు కలిగే అవకాశం ఉంది కానీ, అవి శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడు తుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా యాక్టివిటీ పెరుగుతుంది. వీటిని కొత్త పుంతలు తొక్కించడం జరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఏ వ్యవహారంలోనైనా దూసుకుపోయే తత్వం అలవడుతుంది. ధన సంపాదన బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశివారికి 12వ స్థానంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో సుఖ సంతోషాలు తగ్గుతాయి. జీవిత భాగస్వామి ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తుండడం లేదా వేరే ప్రాంతానికి బదిలీ కావడం వంటి పరిణామాల వల్ల కొద్దిపాటి ఎడబాటు ఏర్పడుతుంది. కలిసి ఉన్న పక్షంలో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల ఊహించని విధంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, విలాసాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది.
  3. కన్య: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో తరచూ వివాదాలు, వాగ్వా దాలు తలెత్తుతుంటాయి. బంధువుల కారణంగా సమస్యలు తలెత్తుతుంటాయి. జీవిత భాగ స్వామి ఏదో ఒక అనారోగ్యంతో ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం మీద దాంపత్య సౌఖ్యం తగ్గుతుంది. అయితే, కుటుంబంలో విహార యాత్రలు ఎక్కువగా చోటు చేసుకునే అవ కాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.
  4. తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తొందరపాటుతనంతో వ్యవహరించడం వల్ల కష్టాలు కొని తెచ్చుకుంటారు. వ్యసనాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే, వృత్తి, ఉద్యోగాల్లో హోదా, జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  5. మకరం: ఈ రాశికి నాలుగవ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. ఈ రాశివారు కుటుంబ పరంగా కొద్ది కాలం పాటు ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దంపతుల మధ్య కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. అపార్థాలు చోటు చేసుకుంటాయి. దాంపత్య సుఖం తగ్గే అవకాశం ఉంది. అయితే, గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఆస్తి కొనడం జరుగుతుంది. ఆస్తి విలువ వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.
  6. మీనం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. ఈ రాశివారు కొద్ది కాలం పాటు జీవిత భాగస్వామితో ఆచితూచి మాట్లాడడం మంచిది. దాదాపు ప్రతి మాటా అపార్థానికి దారి తీసే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు విజృంభించే సూచనలున్నాయి. అయితే, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఇంటికి కావాల్సిన సౌకర్యాలను మెరుగు పరచుకునే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది.