Kanya Rasi | Ugadi Horoscope 2023: శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఫలితాలు ఇలా..
Kanya Rasi Ugadi Rasi Phalalu 2023: తెలుగువారి నూతన సంవత్సర కాలంలో కన్యా రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
తెలుగువారి కొత్స సంవత్సరాదినే ఉగాది అని అంటారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బుధవారం (మార్చి 22) నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 23 నుంచి గురుగ్రహం మేషరాశిలో సంచారం ప్రారంభిస్తుంది. అదేవిధంగా, అక్టోబర్ 24న మీనరాశిలో రాహు సంచారం కన్యారాశిలో కేతువు సంచారం ప్రారంభం అవుతుంది. శని గ్రహం ఈ ఏడాదంతా కుంభ రాశిలో కొనసాగుతుంది. మిగిలిన గ్రహాలు సుమారుగా నెలరోజులు చొప్పున వివిధ రాశుల్లో సంచరించడం జరుగుతుంది. గ్రహాల సంచారం ఆధారంగా శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలంలో కన్యా రాశి వారికి జ్యోతిష్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నది ఇక్కడ పరిశీలిద్దాం.
కన్యా రాశి (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం 2, వ్యయం 11 | రాజపూజ్యం 4, అవమానం 7
ఈ ఏడాది ఆరవ స్థానంలో శని, 8వ స్థానంలో గురు రాహువులు, రెండవ స్థానంలో కేతువు సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా ప్రతికూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. పని భారం పెరిగి శ్రమ అధికం అవుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు, దుబారా పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు పరిష్కారం కావటానికి ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. పిల్లలు బాగా ఒత్తిడికి గురవటం జరుగుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం ఎక్కువగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.
ఇంట్లో శుభకార్యక్రమం..
కుటుంబం మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వ్యసనాలు, విలాసాల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. స్నేహితులు తప్పు దోవ పట్టిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరగటం ఆలయాలను సందర్శించడం వంటివి ఎక్కువగా చోటు చేసుకుంటాయి. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొన్ని విషయాలలో బంధుమిత్రులు అండగా నిలబడతారు. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది. ఇంట్లో శుభకార్యం జరగటానికి అవకాశం ఉంది.
జాగ్రత్త ప్రధానం..
ఉత్తర నక్షత్రం వారికి కొన్ని ఫలితాలు మిగిలిన నక్షత్రాల కంటే మెరుగ్గా ఉంటాయి. ఈ రాశి వారు ఇతరుల విషయాల్లో తల దూర్చకపోవటం చాలా మంచిది. ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
(Note: ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..)
మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..