Horoscope Today: ఈ రాశివారు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.. ఒత్తిడి పెరుగుతుంది

Horoscope Today: ఈ రాశివారు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.. ఒత్తిడి పెరుగుతుంది
Horoscope Today

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా..

Subhash Goud

|

Dec 07, 2021 | 5:03 AM

Today Horoscope: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్‌ 7)న మంగళవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం: ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ చేసే అవకాశం ఉంటుంది.

వృషభం: మానసికంగా ఇబ్బందులు పడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు ఆర్ధిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

మిథునం: బంధు మిత్రుల వల్ల ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి.

కర్కాటకం: వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఏదైనా పనులు చేపట్టే ముందు ఆలోచించి చేపట్టడం మంచిది.

సింహం: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులలో పెట్టుబడులు పెడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం.

కన్య: వృత్తి వ్యాపారాలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

తుల: నూతన వ్యాపారాలు ప్రారంభించే ముందు జాగ్రత్తలు తప్పనిసరి. లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇతర వ్యవహారాలలో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. వ్యాపార వ్యవహారాలు కొంత మందకోడిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిధానంగా సాగుతాయి.

ధనస్సు: కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మకరం: వ్యాపార విషయంలో జాగ్రత్తలు అవసరం. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఏర్పడి కొంత చికాకు తెప్పిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడవలసి వస్తుంది.

కుంభం: మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్థాన చలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీనం: వృత్తి ఉద్యోగమున పనులు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Tulasi Seeds: క్యాన్సర్ కణాలు పెరగకుండా చేసే తులసి విత్తనాలు.. ఈ గింజలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..

Tirupati: సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలుడి అలంకారంలో సిరులతల్లి .. అమ్మవారు ఆరోగ్య, ఐశ్వర్య ప్రదాయిని నమ్మకం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu