- Telugu News Spiritual Tiruchanoor Sri Padmavathi Devi,Venugopala blessed devotees on Suryaprabha Vahanam
Tirupati: సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలుడి అలంకారంలో సిరులతల్లి .. అమ్మవారు ఆరోగ్య, ఐశ్వర్య ప్రదాయిని నమ్మకం..
Tirupati: శ్రీవారి దేవేరి కొలువైన ప్రదేశం తిరుచానూరు. ఇక్కడ పద్మావతిగా , అలివేలు మంగాతయారుగా అమ్మవారు పూజలను అందుకుంటున్నారు. అమ్మవారికి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. కరోనా నిబంధనలను అనుసరిస్తూ టీటీడీ అధికారులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో అలివేలు మంగ భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నారు.
Updated on: Dec 06, 2021 | 5:31 PM

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై వేణుగోపాలకృష్ణుడి అలంకారంలోశ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.

సూర్యభగవానుడు ప్రత్యక్ష నారాయణుడు. లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి. అలాంటి పద్మాలే లక్ష్మికి నివాసస్థానాలు.

సూర్యనారాయణుని సాక్షిగా తిరుచానూరులో శ్రీవారు తపమాచరించి కృతార్థులయ్యారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం.

తిరుపతికి చెందిన శ్రీ పొన్నాల సుధాకర్, శ్రీ ఉదయ్ అనే భక్తులు సోమవారం ఉదయం 100 డజన్ల గాజులు, హుండీ బట్టలు విరాళంగా అందించారు. వీటిని జెఈఓ శ్రీ వీరబ్రహ్మంకు అందజేశారు.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, టీటీడీ అధికారుల, అర్చకులు , తదితరులు పాల్గొన్నారు.





























