Zodiac Signs: 2022లో ఈ 6 రాశులవారికి రాహువు వల్ల కష్టాలు, నష్టాలు ఏర్పడవచ్చు! ఏయే రాశులంటే..

జోతిష్యశాస్త్రం ప్రకారం రాహువుకు ప్రత్యేక స్థానం ఉంది. రాహువు మహర్దశలో ఇతర గ్రహాల అంతర్ధశ జరిగితే.. ఆ రాశుల వారు జాగ్రత్త..

Zodiac Signs: 2022లో ఈ 6 రాశులవారికి రాహువు వల్ల కష్టాలు, నష్టాలు ఏర్పడవచ్చు! ఏయే రాశులంటే..
Zodiac Signs
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 06, 2021 | 9:55 AM

జోతిష్యశాస్త్రం ప్రకారం రాహువుకు ప్రత్యేక స్థానం ఉంది. రాహువు మహర్దశలో ఇతర గ్రహాల అంతర్ధశ జరిగితే.. ఆ రాశుల వారు జాగ్రత్త పడాల్సిందే.! ఎందుకంటే సమస్యలు ఒక్కసారిగా చుట్టుముడతాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి తన కర్మల కారణంగా శుభ ఫలితాలను సులభంగా పొందలేడు. బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. కొత్త సంవత్సరంలో రాహువు కొన్ని రాశులకు సవాళ్లు విసురుతోంది. అవి ఏయే రాశులో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:

ఏప్రిల్ 2022లో రాహువు మేషరాశిలోని రెండో ఇంటిలో సంచరిస్తాడు. అలాంటి పరిస్థితిలో ఈ రాశివారి జీవితంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమయంలో, మేషరాశివారితో ఏదైనా వ్యాపార సంబంధాలు పెట్టుకోవాలనుకుంటే.. తెలివిగా వ్యవహరించండి. ముఖ్యంగా వ్యక్తిగత ఆస్తులను పెట్టుబడి పెట్టొద్దు.

వృషభరాశి:

వృషభరాశికి రాహువు లగ్నస్థితిలో ఉంటాడు. దీని వల్ల మీరు మానసికంగా గందరగోళానికి గురి కావచ్చు. అందువల్ల ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే.. ఒకటి.. రెండు సార్లు అలోచించి మరీ తీసుకోండి. ఇతరులను ఎక్కువగా నమ్మొద్దు. నిర్ణయాల విషయంలో ఇతరులపై అస్సలు ఆధారపదవద్దు. ఏప్రిల్ నెలలో, రాహువు పన్నెండవ ఇంట్లో సంచరిస్తాడు, దీని కారణంగా మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.

కర్కాటకరాశి:

2022లో కర్కాటకరాశి పదో ఇంట్లోకి రాహువు ప్రవేశిస్తాడు. దీని వల్ల ఉద్యోగస్తులపై ప్రభావం పడొచ్చు. అందువల్ల ఏ విషయంలోనైనా సుదీర్ధ చర్చలకు దూరంగా ఉండండి. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే, సరైన నిర్ణయాన్ని తీసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ కావొచ్చు.

కన్యారాశి:

2022వ సంవత్సరం ప్రారంభంలో రాహువు కన్యారాశి తొమ్మిదవ ఇంటిలో సంచరిస్తాడు. ఈ సమయంలో, మీ మదిలో ఎలప్పుడూ సందేహాస్పద స్థితి నెలకొంటుంది. మానసికం ఆందోళనలు కలుగుతాయి. దీని వల్ల వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత రాహువు ఎనిమిదో ఇంట్లోకి సంచరిస్తాడు. ఈ సమయంలో మీకు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

వృశ్చికరాశి:

2022 ప్రారంభంలో, రాహువు ఏడవ ఇంట్లో ఉంటాడు. ఈ సమయంలో మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడవచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. మీరు ముందుగా పెద్దలతో చర్చించండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి.

ధనుస్సు రాశి:

కొత్త సంవత్సరం ప్రారంభంలో, రాహువు ధనుస్సు రాశి ఆరో ఇంటి నుంచి సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చట్టపరమైన విషయాల్లో చిక్కుకోవాల్సి రావొచ్చు. లేదా దాని నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు. ఏప్రిల్‌లో ఐదో ఇంట్లో రాహువు సంచరిస్తాడు. ఆ సమయంలో మానసిక సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.