Horoscope Today: అక్షయ తృతీయ రోజున వీరికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో కలిసివస్తుంది.. మే 14 రాశి ఫలాలు..

Rasi Phalalu on may 14th 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో

Horoscope Today: అక్షయ తృతీయ రోజున వీరికి ఉద్యోగాలు, వ్యాపారాల్లో కలిసివస్తుంది.. మే 14 రాశి ఫలాలు..
Horoscope Today
Follow us
Rajitha Chanti

|

Updated on: May 14, 2021 | 6:32 AM

Rasi Phalalu on may 14th 2021: మన దేశంలో ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. ఈరోజు మే 14న చంద్రుడు మిథన రాశిలో ఉండనున్నాడు. అలాగే ఈరోజు అక్షయ తృతీయ. మరీ ఈరోజున శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేష రాశి..

ఈరోజు వీరికి వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కలిసిరావు.ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయటా మానసిక సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభ రాశి.. 

ఈరోజు వీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలువిస్తరిస్తారు. ఉద్యోగమునపదోన్నతులుపెరుగుతాయి ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు.

మిధున రాశి..

ఈరోజు వీరికి ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి.మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

కర్కాటక రాశి..

ఈరోజు వీరికి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహ రాశి…

ఈరోజు వీరికి బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.

కన్య రాశి..

ఈరోజు వీరు చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.

తులా రాశి..

ఈరోజు వీరి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులకు ఉంటాయి.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరు నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రదర్శనంచేసుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనస్సు రాశి..

ఈరోజు వీరు ఆలోచనలో ఆచరణలో పెడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మకర రాశి..

ఈరోజు వీరికి బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు.ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.

కుంభ రాశి..

ఈరోజు వీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది.ఆకస్మిక ప్రయాణాలుచేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

మీన రాశి..

ఈరోజు వీరికి సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

Also Read: Hanuman Birth Place: ఎటు తేలని హ‌నుమంతుడి జ‌న్మస్థల రహస్యం.. తిరుమ‌లే అంటున్న టీటీడీ.. పాంపానది తీరం అంటోంది తీర్థ క్షేత్ర ట్రస్ట్‌..!