Horoscope Today: ఈ రాశుల వారు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..

Horoscope Today on april 27th 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది.

Horoscope Today: ఈ రాశుల వారు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 27, 2021 | 7:32 AM

Horoscope Today on april 27th 2021: ఇప్పటికీ రాశిఫలాలను నమ్మేవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. తమ రోజూను ప్రారంభించే ముందు తమ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తుంటారు. అందులో భాగంగానే రాశి ఫలాలను తెలుసుకుంటుంటారు. మరీ ఈరోజు (ఏప్రిల్ 27న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా.

మేషరాశి..

ఈరోజు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసుకుంటారు. పలు రకాల శుభవార్తలు వింటారు. ఈరోజు వీరికి లలితా అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

వృషభరాశి..

ఈరోజు వీరు షేర్లు, పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. సంఘబలమైన కార్యక్రమాల్లో అచితుచి వ్యవహరించాలి. దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది.

మిథున రాశి..

ఈరోజు వీరికి వ్యవహారిక విషయాల్లో మంచి పురోభివృద్ధి ప్రారంభమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు అవుతాయి. పార్వతి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి..

ఈరోజు వీరికి శ్రమ ఫలిస్తుంది. నూతన ఉత్సహంతో పనిచేస్తారు. విందు కార్యక్రమాలు కూడా ఉంటాయి. శ్రీవెంకటేశ్వర స్వామి దర్శనం మేలు చేస్తుంది.

సింహరాశి..

ఈరోజు వీరు చేపట్టిన పనులు వాయిదా వేసే ఆలోచన చేస్తుంటారు. వాటి గురించి జాగ్రత్తగా అవగహాన పెంచుకోవడం మంచిది. శివరాధన మేలు చేస్తుంది.

కన్యరాశి..

ఈరోజు వీరికి స్నేహితులతో విభేదాలు ఉండే సూచనలున్నాయి. వివాదంతో కూడిన పనులకు దూరంగా ఉండడం మంచిది. మహాగణపతి దర్శనం మేలు చేస్తుంది.

తులారాశి..

ఈరోజు వీరికి పరిస్తితులు అనుకూలిస్తాయి. ధార్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గోంటారు. విందు, వినోదాలు ఉంటాయి. మహలక్ష్మీ అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి..

ఈరోజు వీరికి పరపతి పెరుగుతుంది. కష్టమైన పనులు చేపట్టి ఇష్టంగా పూర్తిచేసుకుంటారు. ఆంజనేయ స్వామి ఉపాసన బలం పెంచుకోవాలి.

ధనుస్సు రాశి..

ఈరోజు వీరికి షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. శివాలయ దర్శనం మేలు చేస్తుంది.

మకరరాశి..

ఈరోజు వీరు సోదరులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తి లాభాలు కలసివస్తాయి. ఈరోజు శ్రీవెంకటేశ్వర స్వామి వారిని తులసిదళంతో అర్చన చేయడం మంచిది.

కుంభరాశి..

ఈరోజు వీరికి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభాలు కలిసివస్తాయి. ఈరోజు దుర్గా సప్తశ్లోకి పారాయణం మేలు చేస్తుంది.

మీనరాశి..

ఈరోజు వీరికి ఉద్యోగ, వ్యాపారపరంగా చిక్కులు తొలగిపోతాయి. పనుల్లో ఆలస్యం ఉండే అవకాశం ఉంది. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకొని, అమ్మవారికి పాయసం నివేధన చేయడం మంచిది.

Also Read: సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..