AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Phalalu: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today (November 20, 2025): మేష రాశి వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మిథున రాశి వారికి ముఖ్యమైన పనులు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Rashi Phalalu: వారికి వ్యక్తిగత సమస్యలు పరిష్కారం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Rashi Phalalu 20 November 2025
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 20, 2025 | 5:31 AM

Share

దిన ఫలాలు (నవంబర్ 20, 2025): మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన పనుల్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబ ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను ఒకేసారి చక్కబెట్టే ప్రయత్నాల వల్ల ఒత్తిడికి గురవుతారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అదనపు ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ది పొందుతారు. వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. ముఖ్యమైన పనులు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవు తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కివస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. నిరుద్యోగులకు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులు కొత్త లక్ష్యాలను అప్పగించే అవ కాశం ఉంది. వ్యాపారాల్లో నష్టాలు తగ్గుముఖం పడతాయి. ఇంటా బయటా మీ సలహాలు, సూచనలకు విలువ పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కొద్ది శ్రమతో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆదాయం వృద్ధి చెందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో మీ సమర్థత బాగా వెలుగులోకి వస్తుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవ కాశం ఉంది. వ్యాపారాలు కాస్తంత నెమ్మదిగా పురోగమిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవ కాశం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. స్నేహితుల సహాయ సహకారాలతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఒకరి ద్దరు బంధుమిత్రులతో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయడంలో శ్రమ, తిప్పట ఉంటాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు సానుకూలంగా పురోగమిస్తాయి. ఆదాయం వృద్ది చెందుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. తలపెట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితికి ఢోకా ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధు మిత్రుల్లో కొందరికి ధన సహాయం చేయడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. స్వల్ప అనారోగ్య సూచ నలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభ వార్తలు వింటారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో సఫలం అవుతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కొందరు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. జీవిత భాగస్వా మితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదాలు, విభేదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): వృత్తి, ఉద్యోగాలలో ఆదరణ, ప్రోత్సాహాలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్ది లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో రోజంతా ఆశాజనకంగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కొంత ఆలస్యంగానైనా ముఖ్య వ్యవహారాలను పూర్తి చేస్తారు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉన్నపిల్లల నుంచి ఆశించిన కబుర్లు వింటారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

Follow Us
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ఏకకాలంలో రెండు అరుదైన యోగాలు.. నక్క తోక తొక్కబోయే రాశులివే..!
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
ప్రజావాణిలో 7వ తరగతి విద్యార్థిని విన్నపం.. స్పందించిన కలెక్టర్‌
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'రాకాస' డైరెక్టర్ మానస శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
ఆయన నటిస్తుంటే పాత్ర మాత్రమే కనిపిస్తుంది: అజయ్ ఘోష్
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
10గంటల పాటు ఎస్పీ ఛాంబర్‌లో MLA.. అసలు ఇద్దరి మధ్య జరిగిందేంటి
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
Lord Shani Dev: తగ్గనున్న శని దోషం ఎఫెక్ట్.. ఇక వారికి లక్కీ డేస్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం