AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani Dev: శని ఎఫెక్ట్.. వీరికి అదృష్టం తలుపుతట్టనున్నది!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక, గ్రహాల సంచారం అనేది సహజం. ఇక అన్ని గ్రహాల్లోకెల్లా శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. శని గ్రహం శుభ స్థానంలో ఉంటే, శుభ ఫలితాలను ఇస్తుంది. కానీ చాలా వరకు శని ప్రతి కూల ఫలితానే ఎక్కువగా ఇస్తుంటుంది. అయితే నవంబర్ 28న శని వక్ర యాగం చేయనున్నాడు. జూలై 13 నుంచి శని తిరోగమనంలో ఉన్నాడు. దీని వలన కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Nov 20, 2025 | 4:15 PM

Share
శని ఒక రాశిలో దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ఈ సమయంలోనే కొన్ని సార్లు తిరోగమనంలో సంచరిస్తుంటాడు. అయితే ఆ సమయంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలనిస్తే, మరికొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురు అవుతుంటాయి. అయితే శని వక్రగమనం లేదా వక్రయాగం వలన మేషం, మిథునరాశ, సింహరాశి , వృశ్చిక రాశి, ధనస్సు రాశి వారికి ప్రతి కూల ఫలితాలు కలిగితే, వృషభం, తుల, మకర రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కుంభరాశివారు ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి  వారికి శని వక్రగమనం వలన అదృష్టం కలిసి వస్తుందని చెప్పాలి. వీరి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడుతారు. కార్యాలయాల్లో ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఆదాయాలు లాభదాయకంగా ఉంటాయి. దంపతుల మధ్య ఉండే సమస్యలు తొలిగిపోయి ఆనందంగా గడుపుతారు. పూర్వీకుల నుంచి వారసత్వంగా రావావల్సిన ఆస్తిని పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం, ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

3 / 5
మకర రాశి : ఈ రాశి వారికి శని వక్ర గమనం వలన చెడు కాలం ముగిసిపోయినట్లే. వీరు అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. చేతినిండా డబ్బు చేతికి అందడంతో చాలా ఆనందంగా ఉంటారు. వీరు తమ ఇంటిలో శుభకార్యాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. శత్రుత్వం పూర్తిగా తగ్గిపోతుంది. ఇంటా బయట ఆనందకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారు కార్యాలయాల్లో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడుతారు. కొందరు తమ ఆఫీసుల్లో మంచి పదోన్నతలు అందుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

5 / 5