- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: It is dangerous to let these objects fall from your hands
వాస్తుటిప్స్ : ఈ వస్తువులు చేతి నుంచి కిందపడటం అశుభం..ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా?
వాస్తు ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎవరైతే వాస్తు నియమాలను పాటిస్తారో, వారు ఆనందకర జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ కొంత మంది వాస్తు నియమాలు పాటించకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు చేతిలో నుంచి జారి కింద పడిపోవడం చాలా ప్రమాదకరం అంటారు. ఇంతకీ ఆ వస్తువులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.
Updated on: Nov 20, 2025 | 5:06 PM

ఒక వ్యక్తి జీవితంలో వాస్తు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఏ సమయంలోనైనా సరే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని వస్తువులు ఎప్పుడూ మీ చేయి జారకుండా చూసుకోవాలంట. కొన్ని రకాల వస్తువులు మీ చేతుల నుంచి జారి కిందపడితే, అవి మీకు రాబోయే సమస్యలు, ఆర్థిక నష్టాల గురించి సూచిస్తుందంట. కాగా, ఏ వస్తువుల చేతిలో నుంచి జారి కిందపడకూడదో ఇప్పుడు చూద్దాం.

చేతిలో నుంచి ఎట్టిపరిస్థితుల్లో పాలు చింది కిందపడకూడదంట. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. దీని వలన మీరు జీవతంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట.

అదే విధంగా ప్రతి ఒక్కరి ఇంటిలో నల్ల మిరియాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఎప్పుడూ కూడా నల్ల మిరియాలు మీ చేతిలో నుంచి జారి కిందపడకూదంట. దీని వలన ఆర్థిక సమస్యలు పెరుగుతుంటాయి. అదే విధంగా నల్ల మిరియాలు ఇంటిలో చిందర వందరగా పడి ఉండటం వలన ఇవి మీ జీవితంలోకి వచ్చే ప్రతికూలతలను సూచిస్తుందంట.

చేతిలో నుంచి ఎప్పుడూ కూడా ఉప్పు కిందపడకుండా చూసుకోవాలంట. చేతిలో నుంచి ఉప్పు కిందపడటం చాలా అశుభకరం. ఇది మీ జీవితంలోని తీవ్రమైన సమస్యలను సూచిస్తుందంట. అదే వధంగా చేతిలో నుంచి ఆహారం కిందపడం కూడా అస్సలే మంచిది కాదంట, ఇది పేదరికాన్ని సూచిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

అలాగే ఎవరి చేతిలో నుంచి అయితే కొబ్బరికాయ కిందపడుతుందో అది చాలా అపశకునం అంటున్నారు వాస్తు నిపుణులు. ఇది మీ కెరీర్, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలను సూచిస్తుందంట.



