Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Today Horoscope (January 29, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా నిలకడగా సాగిపోతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు, ప్రయత్నాల్లో కార్యసిద్ధి ఉంటుంది. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

దిన ఫలాలు (జనవరి 29, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారికి ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉండే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత బాగా పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కూడా నిలకడగా సాగిపోతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు అనుకూలంగా సాగు తాయి. కీలక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సానుకూలంగా వ్యవహరించడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లల ఆరోగ్యం పట్ల కాస్తంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన వ్యవహారాలు, ప్రయత్నాల్లో కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. పిల్లల వల్ల ఒకటి రెండు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితన వృత్తి రంగాలకు చెందినవారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి నిపుణులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా ప్రోత్సాహకరంగా ఉంటాయి. పిల్లలు చదువుల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన విజయాలు సాధిస్తారు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వృత్తి, ఉద్యోగాలలో అనుకూలత బాగా పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు సైతం వసూలు అవుతాయి. వ్యక్తి గత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగంలో పనిభారం ఉన్నప్పటికీ సకాలంలో లక్ష్యాలను, బాధ్యతలను పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆదాయం పెరుగుతుంది. అయితే, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కొందరు సహచరుల వల్ల డబ్బు నష్టం జరగవచ్చు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం చేయవద్దు. ప్రయాణాల్లో వీలైనంతగా అప్రమత్తంగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలు స్వీకరించి లబ్ధి పొందుతారు. ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా సఫలం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సహాయాలకు, వితరణలకు దూరంగా ఉండడం మంచిది. మోసపోయే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. కొందరు పెద్దల సహాయ సహకారాలతో వృత్తి, వ్యాపారాల్లో ముందుకు దూసుకువెడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల్లో పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా చక్కబడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేసి ఇబ్బంది పడ తారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో కీలకమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబంలో ఒక దైవ కార్యం తలపెడతారు. పిల్లలకు సంబంధించి ముఖ్య మైన శుభవార్త అందుతుంది. మీ ఆలోచనలను, నిర్ణయాలను ఆచరణలో పెట్టడానికి ఇది సరైన కాలం.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత తప్పకపోవచ్చు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువుల్లో ఒకరి ఆరోగ్యం బాగా ఆందోళన కలిగిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. శ్రమ, తిప్పటలకు అవకాశం ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలను, పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సోదర వర్గంతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్లడం, దైవ కార్యంలో పాల్గొనడం జరుగుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు లబ్ధి చేకూరుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యక్తిగత పనులు, కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఇతరుల నుంచి రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి, కొద్దిగా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. మిత్రుల సాయంతో ముఖ్య మైన పనులు చక్కబెడతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా నిలదొక్కుకుంటాయి. కొద్దిగా రాబడి పెరిగే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఆదాయానికి లోటుండకపోవచ్చు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీ నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ప్రయాణాలు లాభిస్తాయి.