Actress : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది.. హీరోలతో ప్రేమాయణం.. బ్రేకప్ కారణంగా సినిమానే వదిలేసిన హీరోయిన్..
చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో కట్టిపడేసిన తారలు చాలా మంది ఉన్నారు. దశాబ్దాల సినీప్రయాణంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు, నటనతో తమదైన ముద్ర వేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ తనకంటే పది సంవత్సరాలు పెద్ద నటుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది.

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఈ నటికి ఇప్పుడు 45 సంవత్సరాలు. అంతేకాదు ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లల తల్లి. అయినప్పటికీ తన అందం, అభినయంతో అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసింది. అలాగే ఒకప్పుడు కుర్రవాళ్ల ఫేవరేట్ హీరోయిన్. యూత్ లో అత్యధిక క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ ఆమె. కానీ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న సమయంలోనే ప్రేమ, బ్రేకప్ కారణగా ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత తనకంటే పది సంవత్సరాలు పెద్ద హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె 2000 లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ నటి పేరు ఆమె తొలి సినిమా సహనటుడు అభిషేక్ బచ్చన్‌తో ముడిపడి ఉంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కరీనా కపూర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్ ఆమె.
నటిగా కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్‌తో ఆమె పేరు వినిపించింది. అయితే వారిద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అని సన్నిహితులు తెలిపారు. తర్వాత కరీనా సోదరి కరిష్మా కపూర్ పేరు సైతం వినిపించింది. వీరిద్దరికి నిశ్చితార్థం సైతం జరిగింది. కానీ అనుహ్యంగా ఇద్దరి పెళ్లి ఆగిపోయింది. “ముజ్సే దోస్తీ కరోగే”, “మై ప్రేమ్ కీ దీవానీ హూన్”, “కభీ ఖుషీ కభీ ఘమ్” వంటి చిత్రాలలో కరీనా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. 2000ల ప్రారంభంలో ప్రేమ వ్యవహారం గురించి పుకార్లు వచ్చాయి. ఈ వార్తలను ఇద్దరూ ఖండించారు. తర్వాత పలువురు హీరోలతో ఆమె డేటింగ్ చేసిందని టాక్.
కరీనా కపూర్ , షాహిద్ కపూర్ జోడికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరు దాదాపు ఐదు సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. కానీ 2007లో “జబ్ వి మెట్” చిత్రీకరణ సమయంలో విడిపోయారు. షాహిద్ కపూర్ తో విడిపోయిన తర్వాత, కరీనా సైఫ్ అలీ ఖాన్ తో డేటింగ్ ప్రారంభించింది. 2007లో “తాషన్” సినిమా షూటింగ్ సమయంలో వారి సంబంధం ప్రారంభమైంది. ఐదు సంవత్సరాల సంబంధం తర్వాత, వారు అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. వారికి తైమూర్, జెహ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
