AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajit Pawar Death: విమానం కూలగానే పెద్ద ఎత్తున మంటలు.. ఇదిగో లైవ్ వీడియో..

Ajit Pawar Death: విమానం కూలగానే పెద్ద ఎత్తున మంటలు.. ఇదిగో లైవ్ వీడియో..

Ram Naramaneni
|

Updated on: Jan 28, 2026 | 1:22 PM

Share

ప్రస్తుతం మహారాష్ట్రలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం కోసమే అజిత్‌ పవార్‌ బారామతి వెళ్లాల్సి ఉంది. ముందు బారామతిలో ఎన్నికల సభలో పాల్గొనాలి. తర్వాత మరో 2 సభలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. కానీ.. బారామతి దగ్గర ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదం జరిగి ఆయన ప్రాణాలు కోల్పోయారు.

మహారాష్ట్రలో విషాదకర ఘటన వెలుగుచూసింది. విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్  చనిపోయారు. సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు డీజీసీఏ ధ్రువీకరించింది. కూలిపోయిన విమానంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ఆయన పీఏ, సెక్యూరిటీ సిబ్బంది ఒకరు, పైలట్, కో పైలట్‌ ఉన్నట్లు తెలిపింది. విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో.. సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఉదయం 8.46 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. తాజాగా విమానం కూలిపోతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కూలిపోయిన సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం వీడియోలో చూడవచ్చు.