MS Narayana: జీవితంలో ఎన్నో బాధకరమైన సంఘటనలు.. ఎప్పటికీ వేంటాడే జ్ఞాపకం అది.. ఎంఎస్ నారాయణ..
తెలుగు సినిమా ప్రపంచంలో హాస్య నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు దివంగత నటుడు ఎంఎస్ నారాయణ. కమెడియన్ గా తన కామెడీ పంచులు, నటనతో తనదైన ముద్ర వేశారు. మరణించి సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు ఎంఎస్ నారాయణ.

దివంగత సినీ నటుడు, హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో చిత్రాలతో తనదైన నటనతో మెప్పించారు. కానీ ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఎంఎస్ నారాయణ మరణం సినీపరిశ్రమకు ఇప్పటికీ తీరని లోటు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్ నారాయణ తన జీవితం, సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు. ఆయన అనుభవాలు కేవలం వ్యక్తిగత జ్ఞాపకాలు కాకుండా, జీవితాన్ని ఎలా చూడాలి, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై ఆలోచింపజేస్తాయి.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన ఏదని ప్రశ్నించగా, తనకంటే చిన్నవారు మరణించడం అని ఎం.ఎస్. నారాయణ అన్నారు. పది మంది సంతానంలో (ఏడుగురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు), తన చివరి చెల్లి మరణం ఆయన్ను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. అప్పట్లో చిన్న టీచర్‌గా, చాలీచాలని జీతంతో కష్టాలు పడుతున్న రోజుల్లో, తన చెల్లికి ఆర్థికంగా ఏమీ సహాయం చేయలేకపోవడం ఆయన్ను ఎంతగానో బాధిస్తుందని చెప్పారు. ఆ పరిస్థితిని గుర్తుచేసుకుంటూ, “ఇప్పుడు బ్రతికుండి ఉంటే ఎంత బాగుండేది! ఎంత ఇచ్చేవాడిని!” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఆయనకు తీవ్రమైన భావోద్వేగపు గాయాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ తనను వెంటాడుతున్నాయని వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
తన జీవితంలో చూసిన అతి విచిత్రమైన వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ, ప్రిన్సిపాల్ తాటక నరసింహారావు గారిని గుర్తుచేసుకున్నారు. ఆయన అసలు నవ్వకుండా, నిత్యం ప్రశాంతంగా ఉండేవారని, కానీ నిజానికి గొప్ప కమెడియన్ అని నారాయణ అన్నారు. ఆ ప్రిన్సిపాల్ గారి ప్రవర్తనను తాను చాలాసార్లు అనుకరించి పేరు తెచ్చుకున్నానని తెలిపారు. ఒకసారి టెలిఫోన్ మోగినప్పుడు ఆయన చూపిన విచిత్రమైన ప్రతిస్పందనను వివరించారు. కాలేజ్ సెక్రటరీ మెంటే పద్మనాభం గారితో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు, స్టాఫ్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందో చెప్పడానికి, కిటికీలోంచి బయట గదిని చూపిస్తూ వివరించేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రవర్తన ఎంత విచిత్రంగా ఉన్నా, నారాయణ గారికి అది ఒక హాస్యం పుట్టించే విషయంగా మారి, తన నటనకు ప్రేరణగా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
తన జీవితంలో జరిగిన మరో ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నైకి ప్రయాణిస్తుండగా, భోజనం అందించే వ్యక్తి ఒకడు పూరీలు అందించేటప్పుడు “ఈ రైల్వే వాళ్లు చేసే పూరీలు కుక్కలు కూడా తినవండి నారాయణ గారు” అని అన్నారట. అప్పటికే మొహమాటం కొద్దీ పూరీలు తీసుకున్న నారాయణ, ఆ మాటలు విని ఆశ్చర్యపోయారు. అయితే, ఈ అనుభవాన్ని కూడా ఆయన ఒక పాత్ర సృష్టికి, వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగించుకున్నారు. అటువంటి “అవమానం” ఎదురైనప్పుడు కూడా, దానిని హాస్యాస్పదంగా తీసుకుని, “బీ స్పోర్టివ్” గా ఉండాలని సూచించారు.
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
