భారత రాజకీయ చరిత్రలో పలువురు ప్రముఖ నేతలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. సీడీఎస్ బిపిన్ రావత్, మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, డోర్జీ ఖండు, మాధవరావు సింధియా, జీఎంసీ బాలయోగి, సినీ నటి సౌందర్య వంటి వారు ఈ విషాద ఘటనలకు బలయ్యారు. ఈ ప్రమాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి.