Tollywood : డైట్ లేకుండానే ఫిట్‌గా ఉన్నా.. కారణం చెప్పిన 34 ఏళ్ల హీరోయిన్..
ప్రస్తుతం హీరోహీరోయిన్ల ఫిట్‌నెస్, బ్యూటీ సీక్రెట్స్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో తారల డైట్, జిమ్ వర్కవుట్స్ గురించి అనేక విషయాలు, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. తాజాగా ఓ బ్యూటీ తన డైట్ సీక్రెట్స్ రివీల్ చేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సినీరంగంలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ప్రతిభతోపాటు అందం, ఫిట్‌నెస్, లుక్స్ సైతం చాలా ముఖ్యం. ఇప్పుడు సినిమా కోసం హీరోయిన్స్ రిస్క్ చేయడంలో ముందుంటున్నారు. పాత్ర కోసం బరువు తగ్గడం, పెరగడం చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్స్ వయసును సైతం తగ్గిస్తున్నారు. ఐదు పదుల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తున్నారు. టబు, శ్రియా, త్రిష , నయనతార సైతం తమ లుక్స్ తో కట్టిపడేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ సైతం తన డైట్ సీక్రెట్ రివీల్ చేసింది. ప్రస్తుతం ఆమె వయసు 34 సంవత్సరాలు. ఇప్పటికీ పదాహారేళ్ల అమ్మాయిల కనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ హన్సిక మోత్వానీ.
అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హన్సిక మోత్వాని. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా డైట్ సీక్రెట్ రివీల్ చేసింది. చాలా కిలోలు బరువు తగ్గిన హన్సిక, తాను ఎలాంటి డైట్ పాటించనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ హన్సిక ఇంటికి వెళ్లి ఆమెను ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే తాను డైట్ లో లేను అని చెప్పుకొచ్చింది. తాను పైలేట్స్ అమ్మాయిని అని చెప్పుకొచ్చింది. పైలేట్స్ అనేది బలం. ఒక రకమైన వ్యాయామం. ఇది ప్రధానంగా ఉదర, కటి, వెనుక కండరాలను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది. ఇది కీళ్లపై ఎక్కువ ఒత్తిడిని కలిగించకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పైలేట్స్ కూడా స్థిరమైన దీర్ఘకాలిక వ్యాయామం. గత ఇంటర్వ్యూలలో వెయిట్ ట్రైనింగ్ తనకు కష్టమని, మొత్తం శరీరాన్ని కదిలించే వ్యాయామాలకు తాను ప్రాముఖ్యత ఇస్తానని చెప్పింది. అదేవిధంగా యోగా చేయడం తనకు నిజంగా ఇష్టమని తెలిపింది.
ఎక్కువ మంది చదివినవి : Devi Movie: అతడు పవర్ ఫుల్ SI.. కట్ చేస్తే.. దేవి సినిమాలో విలన్.. అసలు విషయాలు చెప్పిన డైరెక్టర్..
హన్సిక తదుపరి చిత్రం గాంధారి చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తుంది. దీనికి ఆర్. కన్నన్ నిర్మించి దర్శకత్వం వహించారు. నిర్మాత ధనంజయన్ స్క్రీన్ ప్లే రాశారు. ఈ చిత్రం ఒక ఎమోషనల్ హారర్ థ్రిల్లర్.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..
