అన్‌స్టాపబుల్‌గా షారుఖ్ సాంగ్.. 26ఏళ్లుగా ట్రెండింగ్‌లోనే
1998లో విడుదలైన 'దిల్ సే' చిత్రంలోని 'జియా జలే' పాట 26 ఏళ్లుగా శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది. ప్రీతి జింటా నటించిన ఈ ప్రత్యేక గీతం గుల్జార్ సాహిత్యం, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, మణిరత్నం దర్శకత్వంలో అద్భుతంగా రూపొందింది. షారుఖ్ మ్యాజిక్, కొత్త కొరియోగ్రఫీ ఈ పాటను యూట్యూబ్‌లో నిరంతరం ట్రెండ్ అయ్యేలా చేశాయి. ఇప్పటికీ ఇది అనేకమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంటూనే ఉంది.
1998లో షారుఖ్ ఖాన్, మనీషా కొయిరాలా నటించిన ‘దిల్ సే’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉండేది. ఈ చిత్రంలోని పాటలన్నీ భారీ విజయాన్ని సాధించాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్ ప్రీతి జింటా జియా జలే అనే ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ ఇప్పటికీ ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంటూనే ఉంది. దాదాపు 26 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. జియా జలే పాటలోని బాణీలు, సాహిత్యం ప్రజల మనస్సులను గెలుచుకుంది. 1998లో దిల్ సే సినిమాలో గుల్జార్ రాసిన ఈ సాంగ్‌లో… వధువు భావాలను ఆయన రెహ్మాన్ ట్యూన్‌లో పొందికగా అమర్చారు. ఈ పాటలోని ప్రతి లైన్ అనేక భావోద్వేగాలను తెలియజేస్తుంది. ఈ పాట సాహిత్యం మాత్రమే కాదు. దీని సంగీతాన్ని కూడా అభిమానులు ఉన్నారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికీ చాలా మందికి ఇష్టమైన మూవీ. ప్రీతి జింటా ఈ ఒక్క పాటతో .. అప్పట్లో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. షారుఖ్ ఎప్పటిలానే తన మ్యాజిక్‌తో అందర్నీ మెప్పించాడు. కొరియోగ్రఫీ కొత్తగా ఉండడం… సినిమాటోగ్రాఫర్ అందగా ఈ సాంగ్‌ను చూపించడంతో.. ఇప్పటికే ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ గా.. అన్ స్టాపబుల్ గా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Animal: యానిమల్ పార్క్ అప్‌డేట్ ఇచ్చిన రణబీర్ కపూర్
రీజినల్ సినిమాలకే నేషనల్ రీచ్.. మారుతున్న బాక్స్ ఆఫీస్ ట్రెండ్స్
Sonal Chauhan: సడన్‌గా సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సోనాల్.. జోరు మామూలుగా లేదుగా
రజనీ – కమల్ మల్టీస్టారర్ ఏమైంది.. తెలుసుకోండి
Jr NTR: హైప్ పెంచుతున్న తారక్ టీమ్.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా
విధి నిర్వహణలో ప్రాణాల్ని కూడా లెక్కచేయని ఆర్టీసీ డ్రైవర్
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

