సాధారణంగా ఏటీఎంల నుంచి మనం రూ.100 లేదా రూ.500 నోట్లు మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు. కానీ త్వరలో రాబోయే కొత్త ఏటీఎంల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను కూడా విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఈ హైబ్రిడ్ ఏటీంలలో కేవలం క్యాష్ విత్ డ్రా చేసుకోవటం మాత్రమే కాకుండా..మీ దగ్గరున్న పెద్దనోట్లను వేసి చిన్న నోట్లను తీసుకునే వెసులుబాటు ఉంటుంది.