ఫైలట్ మహిళ అయితే ఆ ప్రయాణం ఇలాగే ఉంటుంది..?!.. అజిత్ పవార్ ట్వీట్ వైరల్
మహారాష్ట్రలోని పూణెలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ దుర్మరణం చెందారు. విమాన ప్రమాదంలో ఆయన మరణించిన తర్వాత, 2024 నాటి ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో అతను ఒక మహిళా పైలట్ గురించి ఒక వ్యాఖ్య చేశారు. అజిత్ పవార్ మరణం ఇప్పుడు ఆయన పోస్ట్ గురించి విస్తృత చర్చకు దారితీసింది. ఇంతకీ ఏంటా పోస్ట్.. ఎవరా లేడీ పైలట్..? పూర్తి వివరాల్లోకి వెళితే....

అజిత్ పవార్ 2024 జనవరి 18న తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో ఒక పోస్ట్‌ని షేర్ చేశారు.. అందులో ఆయన ఇలా రాశారు, మనం హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించినప్పుడు, మన విమానం లేదా హెలికాప్టర్ స్మూత్ గా సురక్షితంగా, ఎలాంటి సమస్య లేకుండా ల్యాండ్ అయితే, పైలట్ ఒక మహిళ అని మనం గ్రహించాలని అన్నారు. అనాటి అజిత్ పవార్ ట్వీట్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ ను అజిత్ పవార్ 2024 జనవరి 18 న పోస్టు చేశారు. ఈ ట్వీట్ కు (#NCPWomenPower)ఎన్సీపీ వుమెన్ పవర్ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేశారు. అజిత్ పవార్ మరణించిన విమాన ప్రమాదంలో పైలట్ కూడా ఒక మహిళ కావడంతో ఈ పోస్ట్ ఇప్పుడు మరింత చర్చనీయాంశమవుతోంది.
అజిత్ పవార్ విమానం నడిపిన మహిళా పైలట్ ఎవరు?
అజిత్ పవార్ బారామతికి వెళ్తున్న ప్రైవేట్ విమానంలో కో-పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్. ఆమెతో పాటు పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్ కూడా ఉన్నారు. శాంభవి న్యూజిలాండ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ పైలట్ అకాడమీ నుండి విమాన శిక్షణ పొందింది. ఆమె సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA) నుండి తన వాణిజ్య పైలట్ లైసెన్స్‌ను కూడా పొందింది. ఆమె డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నుండి భారతదేశంలో వాణిజ్య పైలట్ లైసెన్స్‌ను కూడా కలిగి ఉంది. శాంభవి మరణంతో విమానయాన రంగానికి గట్టి దెబ్బ తగిలింది.
When we travel by helicopter or plane, if our plane or helicopter lands smoothly, we understand that the pilot is a woman.#NCPWomenPower
— Ajit Pawar (@AjitPawarSpeaks) January 18, 2024
అజిత్ పవార్ చివరి పోస్ట్ వైరల్..
అజిత్ పవార్ తన “X” హ్యాండిల్‌లో చివరి పోస్ట్‌ను బుధవారం, 2026 జనవరి 28న ఉదయం 8:57 గంటలకు పోస్ట్ చేశారు. దీనిలో ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపతి రాయ్‌కి నివాళులర్పించారు. మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రతిదీ త్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, స్వయం పాలన ప్రచారకుడు, ‘పంజాబ్ కేసరి’ లాలా లజపతి రాయ్‌కి తన జయంతి సందర్భంగా వినయపూర్వకమైన నివాళులు. ఆయన దేశభక్తి ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినిస్తుంది” అని రాశారు. ఈ పోస్ట్ ఇప్పుడు తొలగించబడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




