AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pension: వారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. రూ.5వేల పెన్షన్ ఇచ్చేందుకు నిర్ణయం!

తల్లిదండ్రులు లేకుండా అనాథులుగా బ్రతుకుతున్న చిన్నారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలవనుంది. అమరావతిలో ఉంటున్న అనాధ పిల్లలకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రి వర్గం తీర్మానించింది. అలాగే రాజధానిలో వీధిపోటు ఉన్న ప్లాట్ల మార్పునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటితో పాటు పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.

Pension: వారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. రూ.5వేల పెన్షన్ ఇచ్చేందుకు నిర్ణయం!
Ap Cabinet Decisions
Anand T
|

Updated on: Jan 28, 2026 | 8:25 PM

Share

అమరావతిలో సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 35 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. PPP పద్ధతిలో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ అభివృద్ధి చేయాలని కేబినెట్‌లో తీర్మానం చేశారు. టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక అమరావతిలో వీధిపోటు ఉన్న ప్లాట్ల మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలమనేరు లైవ్‌స్టాక్‌కు చెందిన 33 ఎకరాలు AMCకి బదిలీ చేయాలనే నిర్ణయానికి మంత్రివర్గం ఓకే చెప్పింది. ఇక అమరావతిలో అనాధ పిల్లలకు రూ.5 వేల పెన్షన్‌ ఇవ్వాలని మంత్రివర్గంలో తీర్మానించారు.

పిడుగురాళ్ల ఆస్పత్రిలో పడకల సంఖ్య 420కి పెంచాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 837 వైద్య సిబ్బంది నియామకానికి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలో 2019లో గార్డెన్ సిటీకి ఇచ్చిన LOI రద్దు చేస్తూ తీర్మానం చేసింది. అథ్లెట్‌ జ్యోతికి విశాఖలో 500 గజాల స్థలంతో పాటు ఆర్థిక సాయం, గ్రూప్‌-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు నియోజకవర్గాల్లో 50 సెంట్ల వరకు భూమి లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఓకే చెప్పింది.

అల్లూరి జిల్లా నందకోటలో ఫైవ్‌స్టార్‌ రిసార్ట్‌ నిర్మాణంతో పాటుగా, కన్వెన్షన్‌ సెంటర్‌, థీమ్‌ పార్కులను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరో మల్టీలెవల్ కారు పార్కింగ్..! గంటకు ఎంత వసూలు చేస్తారో తెలుసా?
మరో మల్టీలెవల్ కారు పార్కింగ్..! గంటకు ఎంత వసూలు చేస్తారో తెలుసా?
వారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై రూ.5వేల పెన్షన్
వారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై రూ.5వేల పెన్షన్
ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు.. ఎప్పటినుంచంటే..
ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు.. ఎప్పటినుంచంటే..
2024లో తోపులు.. కట్‌చేస్తే.. 2026 స్వ్కాడ్ నుంచి ముగ్గురు ఔట్..
2024లో తోపులు.. కట్‌చేస్తే.. 2026 స్వ్కాడ్ నుంచి ముగ్గురు ఔట్..
అలా ఎలా నమ్ముతార్రా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలన్నారు
అలా ఎలా నమ్ముతార్రా.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలన్నారు
ఫైలట్ మహిళ అయితే ఆ ప్రయాణం ఇలాగే ఉంటుంది..?!.. అజిత్ పవార్ ట్వీట్
ఫైలట్ మహిళ అయితే ఆ ప్రయాణం ఇలాగే ఉంటుంది..?!.. అజిత్ పవార్ ట్వీట్
వందల రోగాలని నయం చేసే పరమాద్భుతం చద్దన్నం..
వందల రోగాలని నయం చేసే పరమాద్భుతం చద్దన్నం..
గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడుతాయో తెలుసా?
గబ్బిలాలు తలక్రిందులుగా ఎందుకు వేలాడుతాయో తెలుసా?
ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో 2 గంటల 45 నిమిషాల హార్ట్ టచింగ్ మూవీ
ఓటీటీ టాప్‌ ట్రెండింగ్‌లో 2 గంటల 45 నిమిషాల హార్ట్ టచింగ్ మూవీ
బిగ్ అప్డేట్.. పీఎఫ్ ఖాతాదారులకు బడ్జెట్‌లో గుడ్‌న్యూస్..?
బిగ్ అప్డేట్.. పీఎఫ్ ఖాతాదారులకు బడ్జెట్‌లో గుడ్‌న్యూస్..?