AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Yatra Card: భారత్ యాత్ర కార్డు వచ్చేసింది.. ఒకే కార్డుతో అన్నింటిల్లోనూ ప్రయాణం.. ఎలా వాడాలంటే..?

ప్రయాణికులకు గుడ్‌న్యూస్. ఇక నుంచి మెట్రో, ఆర్టీసీ, రైలు సేవలకు ప్రత్యేకంగా టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. ఒకే కార్డుతో అన్నింటిల్లోనూ ప్రయాణించవచ్చు. ఈ మేరకు భారత్ యాత్ర పేరుతో కార్డు అందుబాటులోకి వచ్చింది. ఈ కార్డు ఎలా వాడాలంటే..

Bharat Yatra Card: భారత్ యాత్ర కార్డు వచ్చేసింది.. ఒకే కార్డుతో అన్నింటిల్లోనూ ప్రయాణం.. ఎలా వాడాలంటే..?
Bharat Yatra Card
Venkatrao Lella
|

Updated on: Jan 28, 2026 | 10:05 PM

Share

దేశవ్యాప్తంగా మెట్రోలలో లేదా ఇతర రాష్ట్రాల్లోని ప్రజా రవాణా వ్యవస్థల్లో ఒకే కార్డుతో పేమెంట్ చేయవచ్చు. మెట్రోలు, ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో పేమెంట్స్ చేయవచ్చు. ప్రతీచోట డబ్బులు చెల్లించి ప్రత్యేకంగా టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దీని వల్ల ప్రయాణికులు సమయం తగ్గడం వల్ల వేగవంతంగా ప్రయాణం చేయవచ్చు. ఈ మేరకు రూపే చెల్లింపు వ్యవస్థ ఆధారంగా పైన్ ల్యాబ్స్ అనే సంస్థ కామన్ మొబులిటీ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యాటకులకు ఈ కార్డు ఎంతో ఉపయోగపడనుంది. ఈ కార్డులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్లు ఇవే..

-ఒకే కార్డుతో మెట్రో, ఆర్టీసీ, రైల్వే స్టేషన్లలో చెల్లింపులు -కాంట్రాక్ట్ లెస్ పేమెంట్స్ -జస్ట్ స్కాన్ చేస్తే ప్రయాణ ఛార్జీలు ఆటోమేటిక్‌గా అవుతాయి -సులువుగా ఈ కార్డ్‌కు రీఛార్జ్ చేసుకునే సౌకర్యం -గరిష్ట బ్యాలెన్స్ రూ.2 వేల వరకు రీచార్జ్ చేసుకోవచ్చు -ఈ కార్డు వాడుకోవడానికి ఎలాంటి కేవైసీ అవసరం లేదు -మొబైల్ నెంబర్, క్యూఆర్ కోడ్ ఆధారంగా కార్డ్ యాక్టివేషన్ చేసుకోవచ్చు

కార్డ్ ఎలా పొందాలి

బ్లింకిట్, జెప్టో, ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ చేసుకోవాలి. రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మీ ఇంటికే కార్డు డెలివరీ అవుతుంది. కేవలం 10 నిమిషాల్లోనే ఇంటికి కార్డు వచ్చేస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్‌లో ఈ కార్డ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో అన్ని నగరాలకు విస్తరించనున్నారు. కార్డు వచ్చాక భారత్ యాత్ర యాప్ డౌన్‌లోడ్ చేసుకుని కార్డును యాక్టివేట్ చేసుకోవాలి. ఇందుకోసం కార్డు వెనుక ఉండే క్యూఆర్ కోడ్ యాప్ ద్వారా స్కాన్ చేయాలి.

భారత్ యాత్ర కార్డు లాంచ్.. ఎలా వాడాలో తెలుసుకోండి..
భారత్ యాత్ర కార్డు లాంచ్.. ఎలా వాడాలో తెలుసుకోండి..
6 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఊచకోత.. వైజాగ్‌లో దుబే బీభత్సం..
6 సిక్స్‌లు, 2 ఫోర్లతో ఊచకోత.. వైజాగ్‌లో దుబే బీభత్సం..
సూపర్‌ డూపర్‌ డ్రైఫ్రూట్‌ లడ్డూ.. రోజు తినేవారు ఇవి తెలుసుకోండి..
సూపర్‌ డూపర్‌ డ్రైఫ్రూట్‌ లడ్డూ.. రోజు తినేవారు ఇవి తెలుసుకోండి..
అనిల్ రావిపూడితో కలిసి చదువుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే?
అనిల్ రావిపూడితో కలిసి చదువుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే?
వెండి ధర సగానికి పడిపోతుందా? 1980 నాటి సీన్‌ రిపీట్‌?
వెండి ధర సగానికి పడిపోతుందా? 1980 నాటి సీన్‌ రిపీట్‌?
అభిషేక్ 'గోల్డెన్ డక్'.. కట్‌చేస్తే ఒకేసారి 2 చెత్త రికార్డులు
అభిషేక్ 'గోల్డెన్ డక్'.. కట్‌చేస్తే ఒకేసారి 2 చెత్త రికార్డులు
విమాన ప్రమాదాల్లో.. వాతావరణమే మెయిన్ విలన్..!
విమాన ప్రమాదాల్లో.. వాతావరణమే మెయిన్ విలన్..!
కొత్త ఆధార్ యాప్ వచ్చేసింది.. సులువుగా మొబైల్, అడ్రస్ అప్డేట్
కొత్త ఆధార్ యాప్ వచ్చేసింది.. సులువుగా మొబైల్, అడ్రస్ అప్డేట్
ఇది మీకు తెలుసా..? ఇడ్లీ అతిగా తింటే డేంజరేనట..! నిపుణుల సూచన
ఇది మీకు తెలుసా..? ఇడ్లీ అతిగా తింటే డేంజరేనట..! నిపుణుల సూచన
పాములా పొడవైన పట్టులా మృదువైన జుట్టు కావాలంటే...ఎన్ని రోజులకు
పాములా పొడవైన పట్టులా మృదువైన జుట్టు కావాలంటే...ఎన్ని రోజులకు