సూపర్ డూపర్ డ్రైఫ్రూట్ లడ్డూ.. రోజు తినేవారు ఇవి తప్పక తెలుసుకోండి..!
డ్రై ఫ్రూట్ లడ్డూలు రోజు తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా పోషకాలు, ఫైబర్ లభించి, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చలికాలంలో శరీరానికి సహజ వెచ్చదనాన్ని అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. రక్తహీనతను కూడా నివారిస్తాయి.

డ్రై ఫ్రూట్స్ లడ్డూ..ఇటీవలి కాలంలో బాగా ఫేమస్ అయ్యాయి. ఈ లడ్డూలను ఎక్కువమంది ఇష్టంగా తింటున్నారు..ముఖ్యంగా చలికాలంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం ఎక్కువగా ప్రజలు ఈ డ్రైఫ్రూట్స్ లడ్డూలను తింటున్నారు. ఇంట్లో తయారుచేసిన కొన్ని ప్రత్యేకమైన లడ్డూలు శరీరానికి సహజంగా వెచ్చదనాన్ని ఇస్తాయి. అయితే, ఈ డ్రైఫ్రూట్స్ లడ్డూలను రోజూ తింటే శరీరంలో జరిగే మార్పులేంటో తప్పక తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు రోజు తినడం శరీరానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజు తినడం వల్ల శరీరానికి తగిన పోషకాలు ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఈ లడ్డు రోజు ఒకటి తింటే శరీరానికి కావలసిన ఫైబర్ తో పాటు పోషకాలు కూడా అందుతాయి. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజు ఉదయాన్నే తింటే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.
ఈ లడ్డు ఉదయాన్నే ఒకటి తింటే శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. ఈ కారణంగా ఇన్ఫెక్షన్ల సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఈ లడ్డు రోజు ఒకటి తింటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి లభిస్తాయి. దీని కారణంగా శరీరానికి మంచి కొవ్వు లభిస్తుంది. చలికాలంలో శనగపప్పు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలను ఇంట్లో తయారు చేసుకుని తినటం వల్ల శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. చలి నుంచి రక్షిస్తాయి. ఈ లడ్డూలను చలికాలానికి పవర్ హౌస్‌గా కూడా పరిగణిస్తారు.
అలాగే ఈ లడ్డు ఉదయాన్నే తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.. దీంతో గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే గుణాలు రక్తహీనత సమస్యను నివారించేందుకు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఇంకా కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి కూడా ఎక్కువగా లడ్డూలను తయారు చేస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




