ఇది మీకు తెలుసా..? ఇడ్లీ అతిగా తింటే డేంజరేనట..! నిపుణుల సూచన ఏంటంటే..
ఇడ్లీ సౌత్ ఇండియాలో ప్రాచుర్యం పొందిన అల్పాహారం. కానీ, వాటిని అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇడ్లీలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. అతిగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, పులియబెట్టిన పిండి వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందుకే మితంగా తినడం శ్రేయస్కరం.

ఇడ్లీ అనేది మనలో చాలా మంది అల్పాహారంగా తినడానికి ఇష్టపడే ఆహారం. ఇది దక్షిణ భారత వంటకం. కానీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మంది ఎంతో ఇష్టంగా ఇడ్లీలు తింటూ ఉంటారు. ప్రతి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చాలా మంది ఇడ్లీనే తింటారు. కొంతమంది భారతీయులైతే ప్రతి రోజు ఆహారంగా కూడా వీటిని తీసుకుంటారు.. నిజానికి వీటిని అతిగా తినడం మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.
అతిగా ఇడ్లీలు తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇడ్లీలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అతిగా తినడం మంచిది కాదని అంటున్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అతిగా తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇడ్లీలలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. కాబట్టి అతిగా తింటే బరువు పెరుగుతారు. ఇడ్లీ పిండిని పులియబెట్టి తయారు చేస్తారు. కాబట్టి ఇలా తయారు చేసిన ఇడ్లీని అతిగా తింటే గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు వస్తాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




