పాములా పొడవైన పట్టులా మృదువైన జుట్టు కావాలంటే…ఎన్ని రోజులకు ఒకసారి నూనె పెట్టాలి..?
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల జుట్టు రాలడం, బలహీనపడటం, తెల్లబడటం సాధారణమైంది. రసాయన ఉత్పత్తులు తాత్కాలికమే. జుట్టు ఆరోగ్యం కోసం సరైన నూనె రాయడం, పద్ధతిగా మసాజ్ చేయడం చాలా ముఖ్యం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. సరైన నూనె, వారానికి 2-3 సార్లు వాడటం, రాత్రిపూట నూనె రాసి ఉదయం కడగడం వల్ల జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు రాలడం, త్వరగా బలహీనపడటం, తెల్ల జుట్టు సమస్యలు ఎక్కువ మందిని వేధిస్తున్నాయి. ఎందుకంటే.. అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేని కారణంగా ఆరోగ్యం, జుట్టు రెండింటినీ ప్రభావితం చేస్తాయి. చాలా మంది తమ జుట్టును బలంగా, మెరిసేలా ఉంచడానికి హెయిర్ ఆయిల్స్, హెయిర్ మాస్క్‌లు వంటి వివిధ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పటికీ, అవి ఎక్కువ కాలం ఉండవు . జుట్టు మళ్ళీ బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీనికి ప్రధాన కారణం జుట్టుకు సరైన నూనె రాయకపోవడం. మీరు వేగంగా జుట్టు పెరగాలని కోరుకుంటున్నారా..? మీ జుట్టును బలోపేతం చేయాలనుకుంటే ఈ నియమాలను పాటించాల్సిందే…
జుట్టు సంరక్షణ ఒక సవాలుతో కూడుకున్న పని, అయినప్పటికీ, కొన్నిసార్లు సరళమైన చిట్కాలు కూడా మీకు పెద్ద ఉపశమనం కలిగిస్తాయి. మీ జుట్టుకు నూనె రాయడం అనేది దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా మెరుస్తూ, బలంగా ఉంచడానికి ఒక సులభమైన మార్గం. జుట్టు పొడిగా ఉండే వారికి నూనె అవసరం ఎక్కువగా ఉంటుంది..ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారికి మాత్రం తక్కువ సరిపోతుంది.
సాధారణంగా వారానికి రెండు నుంచి మూడు సార్లు నూనె పెట్టడం జుట్టుకు సరైన రొటీన్‌గా భావిస్తారు. ఈ విధంగా నూనె పెట్టడం వల్ల తల చర్మానికి సరైన పోషణ అందుతుంది. నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు పెరుగుదల బాగా జరుగుతుంది. రోజూ ఎక్కువ నూనె పెట్టితే చుండ్రు, దుమ్ము సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రి నూనె పెట్టి ఉదయం కడగడం జుట్టుకు ఎక్కువ లాభం ఇస్తుంది. జుట్టు రకం బట్టి వారానికి 2–3 సార్లు నూనె పెట్టడమే మంచి అలవాటు.
మీ జుట్టుకు సరైన నూనెను ఎంచుకోండి. ఇందుకోసం కొబ్బరి నూనె, బాదం నూనె, ఆముదం, మందార నూనె వంటి అనేక రకాల హెయిర్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. కొబ్బరి నూనె జుట్టుకు లోతుగా పోషణనిస్తుంది. బాదం నూనె జుట్టును మృదువుగా చేస్తుంది. ఈ నూనెను నేరుగా కాకుండా కాస్త వేడి చేసి రాసుకోవటం ఉత్తమం. నూనెను వేడి చేయడం వల్ల అది మీ జుట్టులోకి సులభంగా పీల్చుకుంటుంది. రక్త ప్రసరణను పెంచడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి వెచ్చని నూనెను మీ తలపై సున్నితంగా మసాజ్ చేయండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




