AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Growth: వారికి అతి త్వరలో ఆదాయం పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?

Salary Hike and Income Growth Ahead: జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వితీయ స్థానం వ్యక్తిగత సంపాదన గురించి తెలియజేస్తుంది. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగాల ద్వారా వచ్చే జీతభత్యాల గురించి ఇది తెలియజేస్తుంది. సమీప భవిష్యత్తులో జీత భత్యాలు ఏమైనా పెరగబోతున్నాయా? ఏ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఆదాయంలో ఏమన్నా మిగులుతుందా లేక ఖర్చులు పెరుగుతాయా? ఇటువంటి ప్రశ్నలకు గ్రహ సంచారంలో ధన స్థానాధిపతిని బట్టి సమాధానాలు చూడాల్సి ఉంటుంది. అయితే, ధనాధిపతి సంచారం ప్రకారం ఈ ఏడాది ఆరు రాశుల వారికి అతి త్వరలో ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృషభం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశులున్నాయి.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 28, 2026 | 5:00 PM

Share
వృషభం: ఈ రాశికి ధన స్థానంలో ప్రస్తుతం గురు సంచారం వల్ల తప్పకుండా సంపాదన పెరిగే అవకాశం ఉంది. లాభ స్థానంలో శని సంచారం కూడా ఆదాయ వృద్ధికి, ఖర్చులు తగ్గించుకోవడానికి, మదుపు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఆదాయ వ్యయాల విషయంలో వీరు సహజంగానే జాగ్రత్తపరులు. ఉద్యోగపరంగా జీతభత్యాలు బాగా పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాల్ని మించుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయి.

1 / 6
మిథునం: ఈ రాశివారికి ధన స్థానంలో జూన్ మొదటి వారం నుంచి గురువు ఉచ్ఛపట్టబోతున్నందు వల్ల అప్పటి నుంచి ఈ రాశివారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ఖర్చులు తగ్గించుకుని ఆదాయాన్ని మదుపు చేయడం జరుగుతుంది. ఆదాయ వృద్దికి సంబంధించి ఏ అవకాశాన్నీ వదిలిపెట్టడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల కలిసి వస్తుంది.

2 / 6
కన్య: ఈ రాశికి ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు మరో రెండు మూడు నెలల పాటు అనుకూల స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం క్రమంగా పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఉద్యోగంలో పదోన్నతితో పాటు జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి కూడా ఏ మాత్రం లోటుండకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఖర్చుల్ని బాగా తగ్గించు కుంటారు. వ్యాపారాల్లోనూ, షేర్లలోనూ, బంగారంలోనూ భారీగా పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందుతారు.

3 / 6
తుల: ఈ రాశివారికి ప్రస్తుతం ధనాధిపతి కుజుడు, ధన కారకుడు గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాదంతా వీరికి ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఫిబ్రవరి నుంచి వీరి ఆదాయం మరింతగా పెరగడం ప్రారంభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు కనక వర్షం కురిపిస్తాయి.

4 / 6
వృశ్చికం: ఈ రాశికి ధనాధిపతి, ధన కారకుడు అయిన గురువు ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల జూన్ నుంచి వీరి జీవితం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు కూడా సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు, పొదుపు కూడా వృద్ధి చెందుతుంది. వృథా ఖర్చుల్చి బాగా తగ్గించుకోవడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, తదితర ఆర్థిక లావాదేవీల వల్ల బాగా కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి.

5 / 6
మకరం: ఈ రాశివారికి ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలో ఉండడంతో పాటు ధన స్థానంలో రాహువు సంచారం వల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గే అవకాశం ఉండదు. అదనపు ఆదాయాన్ని మదుపులు, పొదుపుల్లో పెట్టడం ద్వారా సద్వినియోగం చేస్తారు. మరింత ఎక్కువగా జీతభత్యాలు ఇచ్చే ఉద్యోగంలోకి మారడానికి బాగా అవకాశం ఉంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి బాగా పెరగడానికి అవకాశం ఉంది.

6 / 6