Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: శుక్రవారం రాశి ఫలితాలు.. నేడు ఈ రాశివారు ఆర్ధికంగా శుభ ఫలితాలను అందుకుంటారు..

అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి.

Horoscope Today: శుక్రవారం రాశి ఫలితాలు.. నేడు ఈ రాశివారు ఆర్ధికంగా శుభ ఫలితాలను అందుకుంటారు..
Horoscope Today
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 04, 2022 | 7:00 AM

మేషం.. మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు పలువురితో ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి, ఒకింత అప్రమత్తత అవసరం. ఇష్టదైవ సందర్శనం చేసుకోవటం ద్వారా ఈ రాశివారికి మేలు కలుగుతుంది.

వృషభం.. వృషభ రాశివారికి ఈ రోజు ఉత్సహంగా ఉంటుంది. తోటివారిని కలుపుకొనిపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు మీకు అండగా ఉంటాయి. ఈ రోజు మీకు శివారాధన శుభప్రదం.

మిథునం.. మిథున రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి.. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. ఈ రోజున మిథున రాశి వారికి శనిధ్యానం శుభకరం.

ఇవి కూడా చదవండి

కర్కాటకం.. కర్నాకట రాశివారికి ఈ రోజు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పాలి. ముఖ్య వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. కీలక విషయాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం.

సింహం.. సింహరాశి వారికి ఈ రోజు లాభాదయకంగా ఉంటుంది. ప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది.. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శని ధ్యానం చదవటం మీకు శుభప్రదంగా ఉంటుంది.

కన్య.. కన్య రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలనిస్తుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. బుద్దిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం శుభప్రదంగా ఉంటుంది.

తుల.. తుల రాశి వారికి ఈ రోజు గొప్పగా ఉంటుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. శివారాధన చేయటం వల్ల శుభాలను అందిస్తుంది.

వృశ్చికం.. వృశ్చిక రాశి వారికి కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. ఆచితూచి వ్యవహరించటం మంచిది. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. శని శ్లోకం చదవాలి.

ధనుస్సు.. ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ రంగాల్లో శుభఫలితాలు అందుతాయి. ముఖ్యమైన విషయాల్లో సొంతనిర్ణయాలు పనిచేస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి. ధర్మసిద్ధి కలుగుతుంది.. విష్ణు సందర్శనం చేయటం వీరికి శుభప్రదం.

మకరం.. మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంది. ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. శ్రీవారి దర్శనం శుభకరం.

కుంభం.. కుంభ రాశివారికి ఇది మంచి కాలంగా చెబుతారు. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇష్టదైవ ప్రార్ధన చేయటం మీకు మరింత మేలు చేస్తుంది.

మీనం.. మీన రాశి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన చేసుకోవటం ద్వారా మానసిక ప్రశాంత కలుగుతుంది.

మరిన్నిరాశి ఫలితాలకు సంబంధించిన వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి