పచ్చిపాలా మజాకా..! ఒక్క స్పూన్‌తో పాలరాతి బొమ్మలా మెరిసిపోతారంతే..

ఇది ముఖాన్ని బాగా స్క్రబ్ చేసి చర్మ రంధ్రాలలో దాగి ఉన్న మురికిని శుభ్రపరుస్తుంది..ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తే చర్మం మెరిసిపోవడంతో పాటు ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి.

పచ్చిపాలా మజాకా..! ఒక్క స్పూన్‌తో పాలరాతి బొమ్మలా మెరిసిపోతారంతే..
Milk Fece Pack
Follow us

|

Updated on: Nov 03, 2022 | 2:03 PM

మీరు చర్మ సంరక్షణ కోసం మార్కెట్లో లభించే కాస్మెటిక్ ఉత్పత్తులపై మాత్రమే ఆధారపడినట్లయితే ఒకసారి ఇది కూడా ట్రై చేయండి.. మీ వంటగదిలో లభించే పచ్చి పాలు కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీ ముఖానికి కేవలం 1 టీస్పూన్ పచ్చి పాలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ప్రతిరోజూ మీ ముఖానికి పచ్చి పాలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎలా పొందుతారని ఆలోచిస్తున్నారా..? పచ్చి పాలలో ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పచ్చి పాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు. లాక్టిక్ యాసిడ్ మంచి మూలం పచ్చి పాలు.. ఇవి చర్మాన్ని బిగుతుగా చేస్తాయి.. పచ్చి పాలు చర్మం టానింగ్‌ని తగ్గించి, ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

మిల్క్ టోనర్ ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత పచ్చి పాలతో మీ ముఖాన్ని క్రమం తప్పకుండా కడగాలి. నిజానికి రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు చర్మం డీహైడ్రేట్ అయి చర్మం పొడిబారుతుంది. పాలతో ముఖాన్ని టోన్ చేయడం వల్ల పొడి చర్మం నుండి బయటపడవచ్చు. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేసి చర్మం కుంగిపోయే సమస్యను తగ్గిస్తుంది. అంటే, మీ చర్మం ముందుగానే వదులుగా ఉంటే, అది తగ్గిపోతుంది. పచ్చి పాలతో ఫేషియల్ టోనింగ్ చేయడం వల్ల ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ పొర తొలగిపోతుంది.

పచ్చి పాలలో దూదిని ముంచి ముఖానికి పట్టించి దానితో ముఖాన్ని మసాజ్ చేయాలి. కళ్ల చుట్టూ అప్లై చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ముఖంపై నల్ల మచ్చలను తొలగించి కాంతివంతం చేస్తుంది. ఇది ముఖ చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా ఛాయను కాంతివంతం చేస్తుంది. రోజుకు ఒకసారి పచ్చి పాలతో ముఖానికి మసాజ్ చేయండి.

ఇవి కూడా చదవండి

పచ్చి పాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది నేచురల్ ఎక్స్‌ఫోలియేటర్. దీనిని ఓట్స్‌తో కలిపి ముఖానికి నేరుగా రాసుకోవచ్చు. ఇది ముఖాన్ని బాగా స్క్రబ్ చేసి చర్మ రంధ్రాలలో దాగి ఉన్న మురికిని శుభ్రపరుస్తుంది.

పచ్చి పాల నుంచి కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. పచ్చి పాలలో శెనగ పిండి, తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 10 నుండి 20 నిమిషాల తర్వాత ముఖం నుండి తొలగించాలి. ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా అప్లై చేస్తే చర్మం మెరిసిపోవడంతో పాటు ముఖంపై ఉన్న మచ్చలు కూడా తొలగిపోతాయి.

మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే పచ్చి పాలను ముఖానికి రాసుకోకూడదు. పెరుగు ముఖానికి రాసుకోవచ్చు.

మరిన్ని ఆరోగ్యసంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Latest Articles
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
తొలి 2 బంతుల్లో భారీ సిక్స్‌లు.. భయపడిన సచిన్ కుమారుడు..
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.? పాన్ ఇండియా సూపర్ స్టార్
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..