Horoscope Today(31 May): వారి సామాజిక హోదా పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..

Horoscope Today (31 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. మరి బుధవారం (31 మే) 12 రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Horoscope Today(31 May): వారి సామాజిక హోదా పెరుగుతుంది.. 12 రాశుల వారికి బుధవారం రాశిఫలాలు..
Horoscope Today (31st May)
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: May 31, 2023 | 6:11 AM

Horoscope Today (31 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. మరి బుధవారం (31 మే) 12 రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

  1. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పొదుపు పాటిస్తారు. కొందరు స్నేహితుల వల్ల ఇబ్బంది పడతారు. ఉద్యోగ పరంగా బాధ్యతలు పెరిగి శారీరక శ్రమకు గురవుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. కొందరు బంధువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది. ప్రేమవ్యవహారాలు ఫలిస్తాయి.
  2. వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ లక్ష్యాలను పూర్తి చేస్తారు. సహచరుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పిల్లలు చదువు లలో బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.
  3. మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆశించిన స్థాయిలో సంపాదన పెరిగే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం మంచిది కాదు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజికంగా హోదా పెరుగుతుంది. ఉద్యోగ జీవితం చాలా వరకు సాఫీగా సాగిపోతుంది.
  4. కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ పరంగా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వినటానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు వెళతాయి.
  5. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితులు చాలావరకు చక్కబడతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఐటీ రంగంలోని వారికి అవకాశాలు పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పర్వాలేదు.
  6. కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వ్యక్తిగత వ్యవహారాల్లో బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. వాహన యోగానికి అవకాశం ఉంది.సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఉద్యోగం విషయంలో మంచి ఆఫర్ అందుతుంది. ఆశించిన స్థాయిలో పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా కొనసాగుతాయి.
  7. తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థిక విషయాలు నిలకడగా ఉంటాయి. దగ్గర వారికి సహాయం చేస్తారు. ఉద్యోగపరంగా జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన లక్ష్యాలను పూర్తిచేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.
  8. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): సంపాదన కొద్దిగా పెరుగుతుంది. అయితే అందుకు తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగంలో అధికారులు కారణంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. వ్యక్తిగత విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి.
  9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): కొన్ని సమస్యల విషయంలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. ఆదాయానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుం టారు. మొండి బాకీలను వసూలు చేస్తారు ఉద్యోగ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
  10. మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): అదనపు ఆదాయానికి ప్రయత్నాలు సాగిస్తారు. ఆర్థిక లావాదేవీల వల్ల కొన్ని మంచి ప్రయోజ నాలు అనుభవానికి వస్తాయి. కొందరు మిత్రులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో తిప్పట ఉంటుంది. ఆరోగ్యం ప్రస్తుతానికి బాగానే ఉంటుంది కానీ శరీరానికి విశ్రాంతి అవసరం. విద్యార్థులకు బాగుంటుంది.
  11. కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థికపరంగా కొద్దిపాటి అదృష్టం కలిసి వస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కొందరు స్నేహితుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి వస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో అధికారులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళతారు.
  12. మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగం పరిస్థితి బాగానే ఉంటుంది. అధికారుల అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. వ్యాపారులు కొద్దిగా లాభాలు గడిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆధ్యాత్మిక విషయాల మీద బాగా ఖర్చు చేస్తారు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?