Horoscope Today: ఆ రాశుల వారికి ఆదాయం పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి గురువారం రాశిఫలాలు..
Rashi Phalalu (29 June 2023): జ్యోతిష్య శాస్త్రం.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనుసరించే విధానం ఇది. గ్రహాల సంచారాన్ని పరిగణలోకి తీసుకుని 12 రాశుల వారికి ఫలానా రోజు ఎలా ఉంటుందో జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. మరి గురువారంనాడు 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Rashi Phalalu (29 June 2023): జ్యోతిష్య శాస్త్రం.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనుసరించే విధానం ఇది. గ్రహాల సంచారాన్ని పరిగణలోకి తీసుకుని 12 రాశుల వారికి ఫలానా రోజు ఎలా ఉంటుందో జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. మరి గురువారంనాడు 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రోజు మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక విషయాలలో కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువులు కొందరు మీ సలహాలను తీసుకుని లబ్ధి పొందుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగే అవకాశముంది. పిల్లల నుంచి మీరు ఆశించిన శుభవార్త వింటారు. నిరుద్యోగులు తీపి కబురు వింటారు. పెళ్లి సంబంధం ఖాయం అయ్యే అవకాశముంది. ఆహార విహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశముంది. బంధు వర్గం నుంచి ఒక మంచి పెళ్లి సంబంధం ఖాయం కావొచ్చు. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒకరిద్దరు సన్నిహితులకు సహాయం చేస్తారు. కుటుంబంలో దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ఆశించిన ప్రయోజనం దక్కుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధించే అవకాశముంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): మీ ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడే అవకాశముంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతర సంస్థలకు మారేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం ఉత్తమం. బంధువులు గానీ, కొందరు మిత్రులు గానీ అపార్థం చేసుకునే సూచనలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు చాలావరకు లాభాల బాటలో నడుస్తాయి. ఐటి నిపుణులకు మంచి పురోగతి కనిపిస్తోంది. సంతాన యోగానికి అవకాశం ఉంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆర్థిక పరిస్థితుల్లో సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా మీరు ఆశించినట్లే మంచి స్థితికి చేరుకునే అవకాశం ఉంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు అప్రయత్నంగా పరిష్కారమవుతాయి. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. వృత్తులకు సంబంధించిన వారు క్షణం కూడా తీరికలేని పరిస్థితికి చేరుకుంటారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ ఉత్తర 1): ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంగా, సరదాగా గడిచిపోతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగడం ఆనందాన్ని ఇస్తుంది. పై అధికారులు మీపై నమ్మకంతో ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశముంది. బంధువుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులైన వారికి సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు, అవరోధాలు ఎదురైనప్పటికీ మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు చేతినిండా పనితో బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండక పోవచ్చు. రుణ దాతల దగ్గర నుంచి కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశముంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోండి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఇక రాదని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఇతరులకు వాగ్దానాలు చేయడం కానీ, హామీలు ఉండటం కానీ చేయకపోవడం ఉత్తమం. వృత్తి, వ్యాపారాలు సజావుగా ముందుకు సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులు వారు చేసే పనిలో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఆర్థిక విషయాల్లో మీ ప్రయత్నాలు, మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగంలో అలవికాని లక్ష్యాలను అప్పగిస్తారు. ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉన్నందున ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఈ రాశివారికి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు వీలైనంత మేరకు దూరంగా ఉండటం మంచిది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో చక్కబడుతుంది. ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక లేనంతగా చేతినిండా పని ఉంటుంది. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు అంది వచ్చే అవకాశముంది. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యక్తిగత పనులను పూర్తిచేస్తారు. ఇరుగుపొరుగు వారితో తగాదా పడే సూచనలున్నందున జాగ్రత్త.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరే అవకాశముంది. మీకు మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. వ్యాపారులు భారీగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. పెళ్లి సంబంధం విషయంలో చికాకులు ఎదురవుతాయి. బంధువులు కొందరు మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉండే అవకాశముంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశముంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశముంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అయితే పొదుపు పాటించడం అవసరం. ఇతరులకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం ప్రస్తుతానికి విరమించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం సొంత ఊరులోనే లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది. దూర ప్రాంతం నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం వ్యక్తుల నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..