Horoscope Today: కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 28, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరగడం వల్ల రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 28th August 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 28, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 28, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం పెరగడం వల్ల రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ధనపరంగా ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. వ్యాపారాలు సవ్యంగా సాగిపోతాయి. ఉద్యోగాల్లో సహచరుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేస్తారు. ఆదాయం పెరగడం వల్ల రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృథా ఖర్చులు తగ్గించాలి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. చేపట్టిన పనులు, వ్యవహారాల్లో కార్య సిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సంబంధించి ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

చేపట్టిన పనుల్లో కొద్దిగా శ్రమ, తిప్పట ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభముంటుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన లాభాల నిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. కోర్టు కేసు కూడా సానుకూలపడుతుంది. పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. సహచరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనులన్నీ సజావుగా సాగిపోతాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రాభవానికి లోటుండదు. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు. అనారోగ్య సంబంధమైన ఇబ్బందులుంటాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు చేపడ తారు. కుటుంబసమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. పెళ్లి ప్రయత్నాల్లో సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. స్థిరాస్తిక్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. కొద్దిగా కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. చదువుల పరంగా పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహం కలిగిస్తాయి. కొందరు బంధువులకు సహాయంగా నిలబడతారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఉద్యోగంలో పనిభారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. కుటుంబంతో దైవ దర్శనాలు చేసు కుంటారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాలు నిరాటంకంగా పూర్తవుతాయి. ధనపరంగా కొన్ని ఇబ్బందులు తొలగి పోతాయి. ప్రయాణాల వల్ల బాగా ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. వ్యాపారాలు జోరందుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండదు. ఉద్యో గంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగానూ మెరుగ్గా ఉంటుంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివా దం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత జ్ఞాప కాలు పంచుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ యోగం పడుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. దూర ప్రాంత బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. బంధువుల నుంచి పెళ్లి సంబంధానికి సంబంధించి కీలక సమాచారం అందుతుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇంటా బయటా విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు నిదానంగా, సాఫీగా పూర్తవుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇంటా బయటా పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. ముఖ్యమైన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. కొన్ని ఆర్థిక ఇబ్బం దుల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. కొందరు ఇష్టమైన బంధుమిత్రు లతో సరదాగా గడుపుతారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. రావల సిన డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో స్థిరాస్తి సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పని ఒత్తిడి ఉన్నా తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. చేపట్టిన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆధ్యాత్మిక విషయాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు. వాహన యోగం పడుతుంది. వ్యాపా రాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహం, ఆదరణ బాగా పెరుగు తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ తాయి. చేపట్టిన వ్యవ హారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అను కూలతలు పెరుగుతాయి. ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. ఆశించిన శుభ వార్తలు వింటారు.