Horoscope Today: ఈ రాశివారు ఎవ్వరిని ఎక్కువగా నమ్మరాదు.. కొన్ని విషయాలలో ఇబ్బందులు తలెత్తుతాయి

Horoscope Today: ప్రస్తుతమున్న కాలంలోనూ చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకునేందుకు ఎంతగానే ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను..

Horoscope Today: ఈ రాశివారు ఎవ్వరిని ఎక్కువగా నమ్మరాదు.. కొన్ని విషయాలలో ఇబ్బందులు తలెత్తుతాయి

Horoscope Today: ప్రస్తుతమున్న కాలంలోనూ చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకునేందుకు ఎంతగానే ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు చాలా మందే ఉంటారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూలై 27) మంగళవారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి:

ఈ రాశివారు ఈ రోజు చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి కీలక సూచనలు, సలహాలు పొందుతారు. ఆత్మవిశ్వాసంలో ముందుకు సాగుతారు. శివున్ని ఆరాధించడం మేలు జరుగుతుంది.

వృషభరాశి:

ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారాలలో మంచి లాభాలు అందుకుంటారు. దుర్గాదేవి నామస్మరణ మేలు చేస్తుంది.

మిథునరాశి:

భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళిక తయారు చేసుకుంటారు. చేపట్టే పనులలో ముందు చూపు తప్పనిసరి అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఉండాలి. శివు నామస్మరణం మేలు చేస్తుంది.

కర్కాకటక రాశి:

ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో మంచి గౌరవం పొందుతారు. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు. గణపతిని ఆరాధించడం మంచిది.

సింహరాశి:

అనుకున్న పనులను వెంటనే పూర్తి చేయగలుగుతారు. అందరిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీ దేవిని పూజించడం వల్ల మంచి జరుగుతుంది.

కన్యరాశి:

కొన్ని సమస్యలు కాస్త ఇబ్బందులకు గురి చేస్తాయి. అవనసరమైన ఖర్చులు పెరుగుతాయి. పెద్దలతో మర్యాదగా వ్యవహరించాలి. ఆర్థి్క ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. గోవసే చేయడం మంచిది.

తులరాశి:

ఈ రాశివారు కీలక విషయాలలో శ్రద్ద వహించడం మంచిది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు. ఖర్చులు పెరుగుతాయి. శివున్ని పూజించడం వల్ల మేలు జరుగుతుంది.

వృశ్చిక రాశి:

పట్టుదలతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. అధికారుల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. అప్పులు చేసే అవకాశం ఉండటంతో ముందుస్తుగానే జాగ్రత్తలు పాటించాలి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

ధనుస్సురాశి:

ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కూడా నమ్మరాదు. కొన్ని విషయాలు ఇబ్బందులు పెడుతుంటే ఓ వార్త సంతోషాన్ని ఇస్తుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మకరరాశి:

ఈ రాశివారు అనుకున్న పనులను పూర్తి చేస్తారు. పెద్దల నుంచి సహకారం అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. దేవి అమ్మవారిని నామస్మరణ మేలు చేస్తుంది.

కుంభరాశి:

ఈ రాశివారికి పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. ఇబ్బందులు పెట్టే విషయాలకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇష్టదైవాన్ని పూజించడం మేలు జరుగుతుంది.

మీనరాశి:

వివిధ రంగాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. మంచి పనులకు పూనాది వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఇష్టమైనవారితో ఎక్కువగా గడుపుతారు. ఇష్టదైవాన్ని పూజించడం మేలు జరుగుతుంది.

Click on your DTH Provider to Add TV9 Telugu