Horoscope Today (July 22): వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం తథ్యం.. 12 రాశులవారికి శనివారంనాటి రాశిఫలాలు..
Horoscope Today (22nd July): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Horoscope Today (22nd July): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు విశ్వసిస్తారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని ఒకరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందని లెక్కిస్తారు జ్యోతిష్య పండితులు. మరి 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు తప్పకుండా మంచి కంపెనీ నుంచి ఆఫర్ అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు అవుతుంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండకపోవచ్చు. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో కలిసి వస్తాయి. స్వయం ఉపాధిలో ఉన్నవారికి మెరుగ్గా ఉంటుంది. ఏ ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ ఆశించిన ఫలితాలను అందుకోవడం జరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా పశువులు అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినప్పటికీ విజయవంతం అవుతుంది. మదుపు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో లాభాలకు లోటు ఉండదు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తి అవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. గృహ వాహన సౌకర్యాలకు సంబంధించి ఆటంకాలు తొలగుతాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన కార్యకలాపాలను పూర్తి చేయడం జరుగుతుంది. పిల్లల కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): వృత్తి, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ సహచరుల కుట్రలు, కుతంత్రాల కారణంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అధికారు లతో కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలు ఉన్నాయి. విదేశాలలో స్థిర పడిన పిల్లలు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వ్యవహారాల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగుతుంది. ఖర్చులు తగ్గిం చుకొని పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడటం జరుగుతుంది. వ్యాపారాలలో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాలకు సంబంధించినంత వరకు సమయం అనుకూలంగా ఉంది. ఓర్పుగా, నేర్పుగా ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టు కోవడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త బాధ్యతలను సమర్ధవం తంగా నిర్వర్తిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారం భించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అను కూలంగా ఉంటుంది. నష్టాల నుంచి బయటపడ తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): వృత్తి ఉద్యోగాల వాతావరణం అనుకూలంగా ఉంటుంది కానీ కుటుంబ వాతావరణం కొద్దిగా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ఇప్పుడు ముఖం తప్పించడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారా లను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): శుభ గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల అను కున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు ఆశించిన స్థాయిలో కలిసి వస్తాయి. మీ సలహాలు, సూచన లకు విలువ పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లకు, లాయర్లకు డిమాండ్ పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ పరంగా సమయం అనుకూలంగా ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. వాటిని వెంటనే ఆచరణలో పెట్టడం మంచిది. ఉద్యోగంలో బరువు బాధ్య తలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆహార విహారాలలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పనులు ఆలస్యం కావడం జరుగుతుంది. కుటుంబ సంబంధమైన వ్యవహారాలకు ప్రాధాన్యం ఇవ్వ వలసి వస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరి స్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. దైవ కార్యాలలో లేదా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వృత్తి జీవితంలో సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో సహచరులు మీ సహాయ సహకారా లను పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఆచి తూచి వ్యవహరించడం మంచిది. డబ్బు నష్ట పోయే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
Note: ఇక్కడ సమకూర్చిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.