Horoscope Today(19 June): వారికి స్నేహితుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు..
Rashi Phalalu(19 June): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంచుకుంటారు. ఈ రోజు ఏ రాశివారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయా? కుటుంబపరంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? తదితర అంశాలను 12 రాశుల వారు ఇవాళ్టి రాశిఫలాల ద్వారా తెలుసుకోండి.
Rashi Phalalu(19 June): భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీన్ని తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంచుకుంటారు. ఈ రోజు ఏ రాశివారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయా? కుటుంబపరంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? తదితర అంశాలను 12 రాశుల వారు ఇవాళ్టి రాశిఫలాల ద్వారా తెలుసుకోండి.
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ రాశి వారికి రోజంతా చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో సహచరుల బాధ్యతలను కూడా మోయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అయితే మొండి బకాయి ఒకటి వసూలు అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. వృత్తి జీవితంలో వేగం పెరుగుతుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా రోజంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి జీవితం కూడా ఉత్సాహంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్ప గించవద్దు. డబ్బు నష్టపోయే లేదా మోసపోయే అవకాశం బాగా కనిపిస్తోంది. జీవిత భాగ స్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది విజయవంతం అవుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. కుటుంబంలో కూడా ఖర్చు పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాలలో అనుకోకుండా ఒకటి రెండు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాస్తంత అప్రమత్తంగా ఉండటం మంచిది. బాధ్యతలపరంగా విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. అదనపు ఆదాయానికి అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అనవసర పరిచయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం. శరీరానికి కొద్దిగా విశ్రాంతి అవసరమని అర్థం చేసుకోండి.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ రాశి వారికి కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరతుంది. కుటుంబ సమస్య పరిష్కారం అవు తుంది. తల్లిదండ్రుల నుంచి ఆశించిన దాని కంటే ఎక్కువగా సహకారం లభిస్తుంది. పిల్లలలో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ సంపాదన పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి అధి కారుల నుంచి ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. కుటుంబంలో పిల్లల కారణంగా కొన్ని చికాకులు తలెత్తే సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో కూడా కొద్దిగా పొరపచ్చాలు చోటు చేసుకోవచ్చు. ఆచితూచి వ్యవహరించడం అవసరం. ఆర్థిక సమస్యలు పరిష్కారం కావచ్చు. స్నేహితుల సహాయంతో ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. సంపాదన, లాభాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం అన్ని విధాలుగాను సహకరిస్తుంది. బంధుమిత్రులకు అండగా నిలబడటం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. పిల్లలలో ఒకరు ఉద్యోగంలో స్థిరపడతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఆస్తి పాస్తుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవ హరించాల్సిన అవసరం ఉంది. కొందరు బంధు వులు మోసగించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవలసిన అవసరం ఉంది. స్నేహితులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో పని భారం పెరిగే సూచనలు న్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకు ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం చాలా మంచిది. కోపతాపాలు తగ్గించుకోవలసిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం ఆశించినంతగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశి వారికి కుటుంబపరంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ, అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడటం జరుగుతుంది. ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. అయితే, ఆహార విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్న ప్పటికీ కొద్దిగా మనశ్శాంతి లోపించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. అధికారుల నుంచి ఆదరణ తగ్గుతుంది. అయితే ఉద్యోగం మారటానికి ప్రయత్నించకపోవడం మంచిది. వృత్తి జీవితంలో కూడా బాగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. క్షణం కూడా తీరికలేని పరిస్థితి కారణంగా విశ్రాంతి దూరం అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఒకటి రెండు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన అవసరాలకు డబ్బు సమకూరు తుంది. అయితే, స్నేహితుల ద్వారా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారా లలో వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం ప్రస్తుతానికి మంచిది కాదు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవు తాయి. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది.
నోట్: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం..
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..