Horoscope Today: ఆ రాశుల వారంతా జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు.. బుధవారం రాశిఫలాలు..
Rasi Phalalu Today: మనం నిత్యం అవసరం లేని విషయాల్లో కూడా.. తల దూర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా
Rasi Phalalu Today: మనం నిత్యం అవసరం లేని విషయాల్లో కూడా.. తల దూర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో మంచి చేయబోతే చెడు ఎదురవుతుంటుంది. ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో కొన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పెద్దలు చెబుతుంటారు. బుధవారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. అయితే.. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి చూద్దాం.
మేష రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఇతరులతో ఇబ్బందులు రాకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. పేదవారికి అల్లం, తదితర ఆహార పదార్థాలను దానం చేస్తే మంచిది.
వృషభరాశి: ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కొంత ఒత్తిడికి గురిచేసే కొన్ని సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రతీ సందర్భాన్ని ముందుచూపుతో గమనించే ప్రయత్నం చేస్తుండాలి. శివారాధన చేయడం.. దేవాలయాలకు సిమెంటును అందించే ప్రయత్నం చేయడం మంచిది.
మిథున రాశి: ఈ రాశి వారికి శుభవార్తలు ఆనందాన్ని కలుగజేస్తుంటాయి. ప్రశాంతంగా ఉంటే మరిన్ని శుభఫలితాలను పొందే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. కర్కాటక రాశి: ఈ రాశి వారికి మానసికమైనటువంటి అశాంతి ఒత్తిడికి గురిచేస్తుంది. ఇతరులతో అకారణంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మర్రిచెట్టుకు నీళ్లు పోయడం మంచిది.
సింహ రాశి: ఈ రాశి వారికి ఆహార, విహారాల్లో ఆనందంగా ఉంటుంది. వాహన లాభాలు కలిసి వస్తుంటాయి. విశేషమైనటువంటి అంగారకగ్రహ స్తోత్రపారాయణం చేసుకోవడం మంచిది.
కన్యా రాశి: ఈ రాశి వారికి అనుకోనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. దూరప్రయాణాల వలన లాభాలు కలిగే సూచనలున్నాయి. పేదవారికి వేరుశనగకాయలను అందించే ప్రయత్నం చేయండి.
తులా రాశి: ఈ రాశి వారికి అనారోగ్య భావాలు తగ్గిపోతుంటాయి. మంచి ఆహారం, విద్యావకాశాలు పొందగలుగుతారు. అనుకున్నటువంటి కార్యక్రమాల్లో కొంత మాట విలువను కోల్పోతుంటారు. అష్టలక్ష్మిస్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఇతరులతో సఖ్యత లేకున్నప్పటికీ.. అనుకున్న ప్రయోజనాలను అందుకోగలుగుతారు. వేరు వేరు రూపాల్లో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన ఆనందాన్ని కలుగజేస్తుంది. గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. శివారాధన మేలు చేస్తుంది.
మకర రాశి: ఈ రాశి వారు అనుకున్న రీతిలో సౌకర్యాలను పొందలేకపోతారు. అలాగే అధికారుల ఆగ్రహానికి గురయ్యే సందర్భాలు ఏర్పడతాయి. సూర్యగ్రహ ఆరాధన మేలు చేస్తుంది.
కుంభ రాశి: ఈ రాశి వారికి స్థిరమైనటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి. మానసికమైనటువంటి కొన్ని రుగ్మతల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
మీన రాశి: ఈ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు అనుకూలిస్తాయి. ఉమ్మడి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. మహాలక్ష్మి అమ్మవారి దర్శనం మేలు చేస్తుంది.
Also Read: