Horoscope Today: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 10, 2024): మేష రాశి వారికి మనసులోని కొన్ని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (ఆగస్టు 10, 2024): మేష రాశి వారికి మనసులోని కొన్ని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ప్రధాన గ్రహాల అనుకూలత కారణంగా మనసులోని కొన్ని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి జీవితంలో సరికొత్త లాభాలను గడిస్తారు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఏ పనైనా, ఏ వ్యవ హారమైనా సకాలంలో పూర్తవుతుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహించని కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు బలంగా ఉన్న కారణంగా రోజంతా చీకూ చింతా లేకుండా రాజయోగంగా సాగిపోతుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితం బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం కలు గుతుంది. ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సానుకూల పడతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఈ రాశివారికి రాశ్యధిపతి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు కలిసినందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం లభిస్తుంది. అనేక విషయాల్లో బాగా బిజీ అయిపోతారు. కొద్ది శ్రమతో ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు లాభాలపరంగా ఊపందుకుంటాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ప్రస్తుతానికి ధన స్థానం, లాభ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆర్థిక పరిస్థితికి లోటుండదు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఉద్యోగ సంబంధమైన శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ఆదరణ లభి స్తుంది. ఇష్టమైన మిత్రులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో సమస్యలను అధిగమిస్తారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఈ రాశిలో శుభ గ్రహాల సంచారం వల్ల అన్ని విధాలుగానూ ప్రాభవం పెరుగుతుంది. వ్యక్తిగత సమ స్యలు చాలావరకు తగ్గుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ప్రతిష్ఠాత్మక కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యో గాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
శుభ గ్రహాల అనుకూలత వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, రాశ్యధిపతి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నందువల్ల ఖర్చుల్ని తగ్గించుకోవడం కష్టమవుతుంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
లాభ స్థానంలో బుధ, శుక్రుల సంచారం కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి కొరతేమీ ఉండదు. మనసులోని కొన్ని కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ధన పరంగా మంచి యోగం పడుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
గ్రహాల ప్రభావం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు మందకొడిగా, నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొద్ది కొద్దిగా మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి చాలా తక్కువగా పెరిగే సూచ నలున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాలను సొంతంగా చక్కదిద్దుకోవడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
తృతీయ, భాగ్య స్థానాలు శుభ గ్రహాలతో నిండినందువల్ల కొద్ది శ్రమతో ప్రతి పనీ పూర్తవుతుంది. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. కొందరు బంధు మిత్రులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్ప డతాయి. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో అధికా రులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
గురు, కుజ, శనులు మాత్రమే అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఉద్యోగంలో కొద్దిపాటి కష్టనష్టాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపో తాయి. ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడం మీద దృష్టి పెడతారు. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. కుటుంబ విషయాల్లో మానసిక ఒత్తిడి ఉంటుంది. ఏదో ఒక విధంగా డబ్బు ఖర్చు అవుతుండడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు ఆశించిన ఫలితాలనిస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
సప్తమ స్థానంపై శుభ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సవ్యంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ గానే ఉంటుంది. ఆస్తి వ్యవహారాలను బాగానే చక్కబెడతారు. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
కొద్దిపాటి గ్రహ బలం వల్ల ఉద్యోగపరంగా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగిపోతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాల వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందే అవకాశం ఉంది. అద నపు ఆదాయ ప్రయత్నాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.