Horoscope Today: వారికి వక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది..12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు
దిన ఫలాలు(ఏప్రిల్ 8, 2024): మేష రాశి వారు వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది కానీ, పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

దిన ఫలాలు(ఏప్రిల్ 8, 2024): మేష రాశి వారు వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది కానీ, పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో అధికారులకు అండగా ఉంటారు. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. పిల్లల చదువుల మీద శ్రద్ధ చూపిస్తారు. కొందరు బంధుమిత్రు లకు వాగ్దానాలు చేసి ఇబ్బంది పడతారు. రావలసిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరిపో తాయి. కొన్ని అవనసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది కానీ, పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. ఆస్తి వివాదం రాజీ మార్గంలో పరిష్కారమవుతుంది. తల్లి తండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగు తాయి. కుటుంబంలో ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. సంపాదనకు లోటేమీ ఉండదు. రాదనుకుని వదిలేసుకున్న సొమ్ము కూడా వసూలవుతుంది. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
వృత్తి, ఉద్యోగాల్లో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. ఆర్థిక వ్యవహారాలన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా బాగా ఒత్తిడి ఉండే అవ కాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెంచడం మంచిది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయ పడతారు. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆశించిన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు బాగా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించు కునే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు బాగా తగ్గు తాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదం కొలిక్కి వస్తుంది. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. దాదాపు ప్రతి ప్రయత్నమూ, ప్రతి వ్యవహారమూ విజయవంతంగా పూర్తవుతాయి. కొందరు బంధువులతో ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పరిచయస్థులలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశముంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామి సహాయంతో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి. ఆర్థికంగా ఆశించిన దానికంటే ఎక్కువగా ముందడుగు వేస్తారు. సోదరులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశముంది. వ్యాపారాల్లో భాగస్వాములతో కొద్దిపాటి విబేదాలుంటాయి. లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులతో పాటు స్థాన చలన సూచనలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. పిల్లలు ఆశించినంతగా వృద్ధిలోకి వస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయపరంగా లోటుండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ జీవితం సాధారణంగా గడచిపోతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితం కూడా చాలావరకు ప్రశాంతంగా ఉంటుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శించడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపోతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగంలో పురోగతి కూడా ఉంటుంది. వ్యాపారాలు బాగా లాభిస్తాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. సోదరులతో ఆస్తి వివాదం విషయంలో రాజీ మార్గం అనుసరిస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త ప్రయత్నాలను చేపడతారు. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనం దంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఆశావహంగా సాగిపోతుంది. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన శుభవార్త అందుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. సామాజికంగా మంచి గుర్తింపు, గౌరవమర్యాదలు లభిస్తాయి. కొందరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగ జీవితం రొటీనుగా సాగిపోతుంది. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు వెడ తాయి. అనుకోకుండా ఒక ప్రధాన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశముంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శుభవార్తలు వింటారు.