AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగాది నుంచి కేతువును వీక్షించనున్న 4 గ్రహాలు.. ఆ రాశులకు ఆదాయం లేదా ఆధ్యాత్మికం!

జ్యోతిషశాస్త్రం ప్రకారం కేతువు ఓ వ్యక్తిత్వం లేని వక్ర గ్రహం. పైగా ఒక అంతుబట్టని గ్రహం. గ్రహాల కలయికను బట్టి, గ్రహాల వీక్షణను బట్టి, కేతువున్న రాశి అధిపతిని బట్టి ఫలితాలనివ్వడం తప్ప సొంతగా ఫలితాలనివ్వడం జరగదు. ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్న కేతువును ఉగాది నుంచి అంటే ఏప్రిల్ 9 నుంచి నాలుగు గ్రహాలు వీక్షించబోతున్నాయి.

ఉగాది నుంచి కేతువును వీక్షించనున్న 4 గ్రహాలు.. ఆ రాశులకు ఆదాయం లేదా ఆధ్యాత్మికం!
Astrology
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 09, 2024 | 11:18 AM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం కేతువు ఓ వ్యక్తిత్వం లేని వక్ర గ్రహం. పైగా ఒక అంతుబట్టని గ్రహం. గ్రహాల కలయికను బట్టి, గ్రహాల వీక్షణను బట్టి, కేతువున్న రాశి అధిపతిని బట్టి ఫలితాలనివ్వడం తప్ప సొంతగా ఫలితాలనివ్వడం జరగదు. ప్రస్తుతం కన్యా రాశిలో సంచరిస్తున్న కేతువును ఉగాది నుంచి అంటే ఏప్రిల్ 9 నుంచి నాలుగు గ్రహాలు వీక్షించబోతున్నాయి. ఈ నెల 23 తర్వాత నుంచి మరో మూడు నెలల పాటు మూడు గ్రహాలు మీన రాశి నుంచి వీక్షించడం జరుగుతుంది. కేతువు రెండే రెండు ఫలితాలను ఇస్తాడు. ఒకటి ఆదాయం, రెండు ఆధ్యాత్మికం. తాజా గ్రహస్థితి వల్ల మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ రెండు రకాల ఫలితాలను ఏకకాలంలో ఇవ్వడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు మీద నాలుగు గ్రహాల దృష్టి పడుతున్నందువల్ల తప్పకుండా ఆదాయ వృద్ధి ఉంటుంది. జీవితంలో కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి విచిత్రంగా బయటపడడం జరుగు తుంది. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలకు చాలావరకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ జీవితం, వృత్తి జీవితంలో ఊహించని మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.
  2. కర్కాటకం: ఈ రాశికి తృతీయ స్థానంలో కేతువు సంచారం వల్ల తప్పకుండా మనసులోని కోరికలు నెరవేరు తాయి. ఇంతవరకూ సాధ్యం కాని ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. ప్రయాణాల వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగు పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధికార యోగంతో పాటు తప్పకుండా ఆదాయ వృద్ధి ఉంటుంది. పెండింగులో ఉన్న పదోన్నతుల్లో కదలిక ప్రారంభమవుతుంది. ఎక్కువగా శుభవార్తలు వింటారు.
  3. కన్య: ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతువు సాధారణంగా చెడు ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. అయితే, నాలుగు గ్రహాల వీక్షణ వల్ల ఈ గ్రహ లక్షణాలలో మార్పు వచ్చి, ఆదాయపరంగా, అధికారపరంగా రాజయోగం కలిగిస్తుంది. ప్రతి పనినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఇష్టమైన ఆలయాలను లేదా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు సమసిపోయి, అన్యోన్యత ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.
  4. వృశ్చికం: ఈ రాశికి లాభస్థానంలో సంచారం చేస్తున్న కేతువు అనేక రకాలుగా ఆర్థిక లాభాలను కలిగిస్తాడు. ఏ రంగానికి చెందిన వారైనా అంచనాలకు మించి పురోగతి సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభి స్తారు. పెట్టుబడులు పెంచడానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు చోటు చేసుకుం టాయి. ఆరోగ్యానికి తగ్గ చికిత్స లభిస్తుంది. ఊహించని విధంగా ఉన్నత స్థాయి స్నేహాలు ఏర్పడ తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
  5. ధనుస్సు: ఈ రాశివారికి దశమ స్థానంలో కేతు సంచారం వల్ల ఉద్యోగ మూలక ఆదాయ వృద్ధికి, అధికార యోగానికి అవకాశముంది. ఉద్యోగంలో ఆకస్మిక అధికార యోగ సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి అవకాశముంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు అప్రయత్నంగా కూడా ఆఫర్లు అందు తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఊహించని మార్పులు సంభవి స్తాయి.
  6. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో కేతువు సంచారం చేస్తుండడం, దాన్ని నాలుగు గ్రహాలు వీక్షిస్తుండడం వల్ల మహా భాగ్య యోగం కలిగింది. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని కీలకమైన శుభ పరిణామాలు, సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు తొలగి పోతాయి.