Ugadi Money Astrology: ఉగాది నాడు మీన రాశిలోకి బుధ గ్రహం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ప్రస్తుతం మేష రాశిలో వక్రించి ఉన్న బుధ గ్రహం ఈ నెల 9న, అంటే ఉగాది రోజున మళ్లీ మీన రాశిలో ప్రవేశించబోతున్నాడు. మీన రాశిలో ఇప్పటికే సంచారం సాగిస్తున్న రాహువు, రవి, శుక్ర గ్రహాలతో బుధుడు కూడా కలవడం జరుగుతుంది. ఒక రాశిలో నాలుగు గ్రహాలు యుతి చెందడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా విపరీత రాజయోగాలు, ధన వృద్ధి యోగాలు, అధికార యోగాలు పట్టే అవకాశముంది.

Ugadi Money Astrology: ఉగాది నాడు మీన రాశిలోకి బుధ గ్రహం.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
Ugadi Money Astrology
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 09, 2024 | 11:18 AM

ప్రస్తుతం మేష రాశిలో వక్రించి ఉన్న బుధ గ్రహం ఈ నెల 9న, అంటే ఉగాది రోజున మళ్లీ మీన రాశిలో ప్రవేశించబోతున్నాడు. మీన రాశిలో ఇప్పటికే సంచారం సాగిస్తున్న రాహువు, రవి, శుక్ర గ్రహాలతో బుధుడు కూడా కలవడం జరుగుతుంది. ఒక రాశిలో నాలుగు గ్రహాలు యుతి చెందడం వల్ల కొన్ని రాశులకు తప్పకుండా విపరీత రాజయోగాలు, ధన వృద్ధి యోగాలు, అధికార యోగాలు పట్టే అవకాశముంది. ఈ నాలుగు గ్రహాల సంయోగం వల్ల వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, కుంభ రాశుల వారు యోగదాయక ఫలితాలు పొందడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఈ నాలుగు గ్రహాలు కలవడం వల్ల తప్పకుండా సంపద పెరు గుతుంది. ఈ నాలుగు గ్రహాల కలయికలో రాశ్యధిపతి శుక్రుడు కూడా ఉండడం, పైగా ఉచ్ఛ పట్టి ఉండడం వల్ల ఏ రంగంలో ఉన్నప్పటికీ ప్రాభవం పెరుగుతుంది. అధికారులు ఎంతగానో ఆదరించి ప్రోత్సహించడం జరుగుతుంది. పదోన్నతులతో పాటు జీతభత్యాల పెరుగుదలకు అవకాశముంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా రాబడి పెరుగుతుంది. సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
  2. మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో నాలుగు గ్రహాల కలయిక వల్ల జీతభత్యాలు భారీగా పెరగడానికి, పదోన్నతికి అవకాశముంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. వృత్తి, వ్యాపా రాల్లో ఎన్నడూ చూడని లాభాలను కళ్లజూస్తారు. ఆర్థికపరమైన కష్టనష్టాలు తొలగిపోతాయి. చాలా కాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు.
  3. కర్కాటకం: ఈ రాశివారు తప్పకుండా వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి చేరుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. విదేశీయానానికి, విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరత్వానికి అవకాశముంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతారు. ఆర్థిక పరిస్థితి ఇతరులను ఆదుకునే స్థాయికి చేరుకుంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం, అన్యోన్యత మరింతగా అభివృద్ధి చెందుతాయి.
  4. తుల: ఈ రాశివారికి ఆరవ స్థానంలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల అకస్మాత్తుగా ఆదాయం పెరగడం, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం కావడం జరుగుతుంది. శత్రు బాధలు, పోటీదార్ల బెడద మటు మాయం అవుతాయి. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా అనేక అవకాశాలు అంది వస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే కార్యక్రమాలు చేపడతారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.
  5. మకరం: ఈ రాశికి మూడవ రాశిలో నాలుగు గ్రహాలు కలవడం, అందులో శుక్రుడు ఉచ్ఛలో ఉండడం వల్ల ఈ రాశివారికి అన్ని విధాలుగానూ బాగా కలిసి వస్తుంది. అధికారులే కాక, సహోద్యోగులు కూడా అండగా నిలబడతారు. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మంచి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా పురోగతి చెందుతారు. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి.
  6. కుంభం: ఈ రాశివారికి ధన స్థానంలో గ్రహణం పట్టినందువల్ల ధన సంబంధమైన లావాదేవీలు, ప్రయత్నాలన్నీ లాభదాయకంగా మారుతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. ఆదాయం క్రమంగా వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడడంతో పాటు రాబడి బాగా పెరుగుతుంది. సర్వత్రా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు విస్తారిస్తాయి.

చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా