Horoscope Today: వారు వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (సెప్టెంబర్ 4, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశికి చెందిన వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. మిథున రాశి వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: వారు వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 04th September 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 04, 2024 | 5:01 AM

దిన ఫలాలు (సెప్టెంబర్ 4, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృషభ రాశికి చెందిన వారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. మిథున రాశి వారికి రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కొందరు బంధువులతో కలిసి సేవా కార్యక్రమాలు తలపెడతారు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ముఖ్యంగా కుటుంబ ఖర్చులు అంచనాలను మించుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాదరంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాలరీత్యా ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధుమిత్రులతో శుభ కార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలున్నా విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఉపయోగం ఉన్నప్పటికీ శ్రమాధిక్యత ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. కొందరు సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. రావలసిన డబ్బు అందుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

బంధువుల నుంచి అవసరమైన సహకారాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. వ్యాపారాలు బాగా లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఆశించిన ప్రోత్సాహకాలు లభి స్తాయి. ఇంటా బయటా మీ మాట బాగా చెల్లుబాటవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా చక్కదిద్దుకోవడం మంచిది. ఏ విషయంలోనూ తొందరపాటు పనికి రాదు. ప్రయాణాల్లో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. దాయాదులతో భూ వివాదాలు తొలగు తాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభి స్తుంది కానీ, సహోద్యోగులతో సమస్యలుంటాయి. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. వ్యక్తిగత సమస్యలకు అనుకోకుండా పరిష్కారం లభిస్తుంది. ఆదాయానికి లోటుండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన ప్రతి పనీ విజయవంతంగా పూర్త వుతుంది. ఆస్తుల కొనుగోలు మీద దృష్టి పెడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ సేవలను బాగా ఉపయోగించుకుంటారు. నిరుద్యోగు లకు ఆశించిన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా, సంతోషంగా కాలక్షేపం చేస్తారు. వస్త్రాభరణాలను కొనడానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి. ప్రయాణాల వల్ల కూడా కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు మిత్రులతో మనస్పర్థలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

సొంత పనులను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెడతారు. పిల్లల చదువుల విషయంలోనూ జాగ్ర త్తలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేసి ఊరట చెందుతారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగి పోతుంది. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొత్త కార్యక్రమాలు, ప్రయత్నాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల సలహాలు పాటించడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో చిన్నపాటి సమస్యలు, అపార్థాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాల్లో లాభాలకు బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ప్రయాణాల వల్ల ఆశించిన ఫలితాలను పొందుతారు. బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం బాగా పెరుగుతాయి. చేపట్టిన పనులన్నిటినీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఉండకపోవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రానికి వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తిని కలిగిస్తుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థికంగా కొద్దిగా మెరుగైన పరిస్థితులంటాయి. అనవసర ఖర్చుల్ని, అనవసర సహాయాల్ని బాగా తగ్గించుకుంటారు. కొందరు బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేపట్టి యాక్టివిటీని, లాభాలను పెంచుకుంటారు. ఉద్యోగంలో అధికారులకు నమ్మకం కలిగి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. అనుకోకుండా మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి బాగా తగ్గిపోతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. కొందరు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతితో పాటు ఆశించిన స్థాన చలనాలు ఉండవచ్చు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభి స్తాయి. నిరుద్యోగులు సరికొత్త ఆఫర్లు అందుకునే సూచనలున్నాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

చేపట్టిన ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ కార్యసిద్ధి ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కార మయ్యే అవకాశం ఉంది. ప్రముఖులతో మంచి పరిచయాలు వృద్ధి చెందుతాయి. కొద్ది ప్రయ త్నంతో వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కీలక వ్యవహారాల్లో మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
కాంచన 4 లో పూజా హెగ్డే.! కమ్‌బ్యాక్‌ కోసం ట్రైల్స్..
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
ఇది కదా మాక్కావాల్సింది,ఇదికదా మేం కోరుకుంది అని అంటున్న ఫ్యాన్స్
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
రామ్ చరణ్ ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటున్నారు.? ఫ్యాన్స్ పరేషాన్..
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
బుడమేరుపై పుకార్లు.. బెజవాడలో కలకలం.. వదంతులపై మంత్రి ఏమన్నారంటే?
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
ది గోట్ మూవీలో హీరో విజయ్ కారు నంబర్‌ను గమనించారా? నెట్టింట వైరల్
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
కౌశిక్‌రెడ్డి ఏం తప్పు మాట్లాడారు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
KBCలో పవన్ పై ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్..
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేస్తోంది.. రూ. 15వేలలో
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మహాగణపతిని దర్శించుకోవడానికి వెళ్తే.. ఇదేం పని!
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!
పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!