AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూలై 2 రాశిఫలాలు: ఆ రాశులకు ధనలాభం, ఉద్యోగ యోగం..! మీ రాశికి చెక్ చేసుకోండి

Horoscope Today (02 July 2026): గురువారం గ్రహాల అనుకూల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, ఆదాయ వృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు ఏయే విషయాల్లో శుభ ఫలితాలు, ఎక్కడ జాగ్రత్తలు అవసరమో తెలుసుకోండి.

జూలై 2 రాశిఫలాలు: ఆ రాశులకు ధనలాభం, ఉద్యోగ యోగం..! మీ రాశికి చెక్ చేసుకోండి
Horoscope Today 02 July 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 02, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూలై 2, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. వృషభ రాశి వారు ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. పని ఒత్తిడి తగ్గడానికి వీలుంది. వృత్తి, వ్యాపా రాల్ని లాభాల బాటలో నడిపిస్తారు. ఆర్థికంగా గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరులు, కొందరు బంధువులతో వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆదాయానికి లోటుండదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమ వుతాయి. కుటుంబంలో కొద్దిగా బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో బాగానే రాబడి పెరుగుతుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. కొద్దిగా వ్యయ ప్రయాసలున్నా కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఇబ్బంది ఉండదు. అవసరానికి తగ్గట్టు డబ్బు అందుతుంది. సోదరులతో ఆస్తి వివా దంలో రాజీమార్గం అనుసరిస్తారు. జీవిత భాగస్వామి కోసం వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. వ్యక్తిగత సమస్య అనుకో కుండా పరిష్కారమవుతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగు తుంది. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆదా యపరంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Also Read: మీ పుట్టిన తేదీ చెప్పేస్తుంది.. ఏ వయసులో సొంత ఇల్లు యోగం ఉందో..?

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలకు పరి ష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గౌరవ మర్యా దలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టుల్ని చేపడతారు. ఇంటా బయటా ఉత్సాహకర వాతా వరణం ఉంటుంది. బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. శుభవార్తలు ఎక్కువగావింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, వ్యాపారాలు బాగా సంతృప్తికరంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొం టారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికా రులు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడ తాయి. పిల్లల చదువుల విషయంలో కాస్తంత శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

Also Read: జూలై 2026 మాసఫలాలు.. ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు..

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం ఉంది. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందు తాయి. తల్లితండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. జీవిత భాగస్వామి ఏ రంగంలో ఉన్నప్పటికీ, అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాధ్య తల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబంతో శుభకార్యంలో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

Also Read: జూలైలో వారు నక్కతోక తొక్కే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. మీ సలహాలు, సూచనలకు అధికారులు విలు వనిస్తారు. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని చక్కబెట్టడం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరి స్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబసమేతంగా దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిత్రులకు సహాయపడతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల్ని పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కార మవు తుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొంద రపడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. ఇష్టమైన మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

Also Read: పరివర్తన యోగం.. మరో వారంలో వారి దశ తిరగడం ఖాయం..!

Follow Us